Pages

Thursday 6 June 2013





మృత్యు  కుహరాలు

నిర్లక్ష్యమో,నిరుపయోగమో,
రోడ్డుమద్యలో మురికి గుంటలు,
మృత్యుగొంతుకలు  తెరుచుకొంటున్నాయి.

తడబడే  హడావిడి  అడుగులూ,
రయ్యన  దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలూ,
గిరుక్కున పడి ఇరుక్కుంటున్నాయి.

నడిరోడ్డున  నోరెళ్ల బెట్టుకొని,
పారిశుధ్య వారి పరాకు వల్లా,

నడిచేవారి నడ్డి విరుస్తున్నాయి.

నగరం మద్యన నయాగరా జలపాతంలా,
చిక్కటి గందాన్ని చెక్కిలిపై చిలుకుతూ,
సుగందాన్ని నాసికలకు అందిస్తున్నాయి.

శాసనసభ్యుల,మంత్రివర్యుల మార్గమైతే,
ఈ మురికి నోళ్ళు మూతపడుతున్నాయి,
రాచమార్గం  రంగవల్లులు అద్దినట్లుంటుంది.

అడిగేవాడూ లేడు,అడ్డుకొనేవాడూ లేడు,
ముక్కుమూసుకొని మురికి తొక్కుకుంటూ,
మూసీనదిలో ఈదుతున్నామనుకోకు.


ఓటు అడగటానికి ఈ బాటనే కదా వస్తారు?
కారులేకుండా కాలి నడకన రమ్మని చెప్పు.
ముప్పుతెచ్చే ఈ మృత్యుకుహరాలను మూసివేస్తే.....ఓటు వేస్తానని చెప్పు.