" సమజవతలేదు "
దిమాక్ కరాబయ్తాంది
గీ .. బతుకులు జూస్తుంటే,
ఏటికేడు కాలమవతాదనుకుంటే,
ఆగమవతానే ఉండాది.
పోరగాడి సదువు పూర్తయినాదిలే అనుకుంటే ,
కొలువు పతంగై పైన కూచున్నాది.
గీ పల్లెలో ఏముంది,
నీళ్ళకోసం మైళ్ళు నడుసుడయ్యే ,
ఊర్ల నీళ్ళు దాగితే ,
కాళ్ళు వంకర్లు బోవుడే ఇగ.
అవ్... ...ఒక్క మాటడగాల్నే నిన్ను ,
ఓటు దీసుకుంటివి గదా..మా దూప దీర్చవా?
ఇంగితముంటే ,
జరా సొంచాయించు,
గాయనెవరో మూటగట్టుకున్నాడు,
గీయనెవరో ముల్లె గట్టుకున్నడు ,
గీ భోగాతమ్ రోజూ ఉండెడిదే,
మేము గట్టిన శిస్తులూ ,మేము గట్టిన పన్నులూ
మస్తు అయితాయి గదా ...,
మరి ,
గాడేమి పట్టుకెల్లిండో, గీడేమి పెట్టి ఎల్లిండో,
ఏలి ముద్రగాళ్ళమ్ మాకేమెరిక?
అయినా నాకు తెల్వక అడగతా.... ,
అందరూ గల్సి ,జాతరలెక్క జమయ్యి ,
మా పీనిగిల మీదకెల్లి ....చిల్లరేరుటేందే ......సమజవతలేదు