ఏల ఈ భే(ఖే)దం
తెలి మబ్బునై అంబరం చేరిన నేను, కరి మబ్బునై నేల రాలాను,
తెల్లని మల్లియనై వెన్నెలకు విరిసిన నేను, నల్లని కలువనై నిశిని చేరాను,
వరదగోదారినై ఉరకలెత్తిన నేను, నిండు చెరువునై నిమ్మకుండి పోయాను,
చందన శాఖ కుందనపు బొమ్మనైన నేను, వొళ్ళంతా గాయాలతో పిల్లనగ్రోవినైనాను.
కోటి కోరికల ఉత్తేజ విహంగమైన నేను, రెక్కలు తెగిన పక్షిలా నేలకోరిగాను,
ప్రణయ యాత్రలో వలపు మజలీనైన నేను, విరహ వీధిలో బాటసారినైనాను.
ఆరని తొలిసంతకపు అమృత తడి నైన నేను, చెల్లని వీలునామానైనాను.
అందాల ప్రఘాడిత పరిమళమైన నేను, అనాఘ్రాత పుష్పమైనాను.
సప్త పదుల సంఘటిత భావమైన నేను, తడబడే అడుగునైనాను.
దూరమయ్యే దారిని అంచనా వేస్తున్న నేను, నిశ్శబ్దనిరీక్షణి నైనాను.
ఆత్మీయ సరాగాల సాగరంలో మునిగిన నేను. అంతిమ యాత్రలో దింపుడుకల్లంలో ఉన్నాను.
నేనెప్పుడూ నిరాదరినే, ఉషోదయపు తుషార బిందువులకై, దోసిలి పట్టిన దాహార్తిని నేను.
నేనెప్పుడూ నిరాదరినే, నీ కటాక్ష వీక్షణాలకై వేయి కనులతో వేచిన భిక్షువును నేను.
కవిత చాలా ఉన్నత స్థాయి లో వుంది.కానీ ఆమె పరిస్థితి అంత దయనీయం గా వర్ణించారు.కొంచెం బాధని పించింది.
ReplyDeleteశేఖర్ గారూ, మీ ఉన్నత ప్రశంసకు చాలా థాంక్స్. నా కవితలు, కథలు చదివే మీకు ధన్యవాదాలు.
Deleteనిగూఢ భావ శక్తితో.. చాలా చక్కని కవితని అందించారు.
ReplyDeleteవేదనా భరితమైన కవిత. :(
వనజ గారూ,మీకు నచ్చిందంటే నాకు చాలా సంతోషం. నా కవితల వెనుక మీ ప్రోత్సాహం ఉంది, మీకు నా ధన్యవాదాలు.
Deleteకవిత చాలా...చాలా బాగుంది పాతిమా గారు!
ReplyDeleteనాగేంద్ర గారూ, నా కవిత చదివిన మెచ్చిన మీకు ధన్యవాదాలు.
Deleteచాలా చక్కని కవిత, పదలయ విన్యాసంలా ఉంది చదువుతూ ఉంటే...
ReplyDeleteనిజంగా...చలం గారి రవీంద్రుని అనువాద కవిత్వం "గీతాంజలి" చదివినట్టు అనిపించింది.
అభినందనలు!
చిన్ని ఆశగారూ, ఎంత గొప్ప ప్రశంస అందుకున్నాను మీనుండి, అంత గొప్ప కావ్యంతో సరితూగగలనో లేదో కానీ, మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఎంత అంటే నాకు బొమ్మలు వేయటం వచ్చినంత. మరో మారు థాంక్స్ సర్.
Deleteనీ కటాక్ష వీక్షణాలకై
ReplyDeleteవేయి కనులతో వేచిన భిక్షువును నేను.
chaalaa chakkaga raasaarandi.
భాస్కర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహానికి ప్రత్యెక కృతజ్ఞతలు సర్.
Deleteబాగా టచ్ చేసేసింది ఫాతిమా గారు...........
ReplyDelete"దూరమయ్యే దారిని అంచనా వేస్తున్న నేను, నిశ్శబ్దనిరీక్షణి నైనాను"
చాలా బాగుంది :)
సీతా డియర్, కవిత నచ్చినందుకు చాలా సంతోషం. మీరు నా ప్రతి కవితా చదివి నన్ను ముందుకు నడుపుతున్నారు ప్రత్యెక కృతజ్ఞతలు.
Deleteనిరంతర నిరీక్షణకు పరాకాష్టలా ఉంది మీ కవిత...
ReplyDeleteఆ చిత్రంలోని స్త్రీ హృదయాన్ని మీ కలం మాముందు ఉంచినట్లుంది ఫాతిమా గారూ!
చక్కని చిత్రాన్ని ఎంచుకున్నారు మీ కవితకి...
అభినందనలు...
@శ్రీ
సర్, మీ ప్రశంసకు ధన్యవాదాలు, నా కవితను అన్నికోణాలనుండి చూసి మెచ్చుకున్న మీకు కృతజ్ఞతలు.
Deleteఇలాంటి కవితలు చాలా బాగా రాస్తారు. One of your best!
ReplyDeleteవెన్నెల గారూ, కవిత చదివిన, మెచ్చిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteGood mixture of lyrical bueuty and sadness.
ReplyDelete"hai sabse madhur voh geet jinhe ham dard ke sur me gate hai"
This comment has been removed by the author.
DeleteThank U Sir, for visiting my blog and for your feel for "DARD"
DeleteNice Akka :)
ReplyDeleteథాంక్స్ , తమ్ముడు కవిత నచ్చినందుకు.
Deleteచాలా బావుంది ఆర్దత బాగా కనిపిస్తుంది మీ కవితలో ఫాతిమా!! అది అన్ని సార్లు రాదు అన్నిటిని చూసిన కూడా రాదు
ReplyDeleteదేనిని చూసి నువ్వు భాదపడి ఖేద పడతావో,
దేనికి నీ గుండె స్పందిస్తోందో అప్పడు
నీ లోవున్న ఆవేదన,ఆవేశం ఉప్పొంగి కవితాగోదావరి వెల్లువలా లా విర్చుకుపడుతుంది!!
ఫల్గుణి గారూ, మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా కవితలోని భావాలకు నేను న్యాయం చేసాను అనిపించింది మీ ప్రశంస చూసిన తర్వాత. ప్రతి కవి పడే తపన అదే తాను ఏ అంశాన్ని ఎన్నుకుంటే దానిలో జీవమున్న భావజాలాన్ని నింపగలగాలి. మరో మారు థాంక్స్ మీ స్పందనకు
Deletejelasy అయ్యింది నాకు ఇంతటి పదజాలం లేదే అని !!! చాలా బాగుంది
ReplyDeleteలక్ష్మీ రాఘవ
లక్ష్మిగారూ, మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు.
Deleteఫాతిమా గారు చాలా బాగుంది...
ReplyDeleteసాయి గారు ధన్యవాదాలు కవిత నచ్చినందుకు.
ReplyDeleteమళ్ళీ మళ్ళీ అదే వరద గోదారి పొంగు
ReplyDeleteకనిపిస్తోంది మీ కవితలో.
మీకు తెలుగు పదాలు చిన్ననాటి నేస్తులా ఏమిటి?
ఎక్కడికక్కడ పొందికగా అమరిపోతాయి.
ఈ విషయంలో మీ ' దత్త తండ్రి ' శ్రీ శ్రీ కి ఉన్న
సాధికారత మీకు వారసత్వంగా వచ్చిందని
అనిపిస్తోంది.
కవిత చాలా బాగుంది.
సున్నితమైన బాలెన్స్ కనిపిస్తోంది.
ఖేదం. కాదు కాదు సర్వజనామోదం మీ కవితలు!
సార్, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. ఇకపోతే కవితావారసత్వ శైలిలోనేను శ్రీ.శ్రీ. గారి దత్తపుత్రికను అనుకోవటం గర్వమే, మీ ప్రశంసకు మరోమారు ధన్యవాదాలు.
ReplyDeleteపాపం ఎంత బాధా...
ReplyDeleteఅవును కదా పాపం. సర్ కవిత చదివిన మీకు థాంక్స్.
ReplyDeletemiraj
ReplyDeleteమీ మెయిల్ ఐ డి తెలియక ఇక్కడ రాస్తున్నాను . ఒకసారి నా బ్లాగు లోని ఇది చదవండి.
http://lkamakoti.blogspot.in/2010/07/blog-post_27.html
లక్ష్మీ రాఘవ