మృత్యు కుహరాలు
నిర్లక్ష్యమో,నిరుపయోగమో,
రోడ్డుమద్యలో మురికి గుంటలు,
మృత్యుగొంతుకలు తెరుచుకొంటున్నాయి.
తడబడే హడావిడి అడుగులూ,
రయ్యన దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలూ,
గిరుక్కున పడి ఇరుక్కుంటున్నాయి.
నడిరోడ్డున నోరెళ్ల బెట్టుకొని,
పారిశుధ్య వారి పరాకు వల్లా,
నడిచేవారి నడ్డి విరుస్తున్నాయి.
నగరం మద్యన నయాగరా జలపాతంలా,
చిక్కటి గందాన్ని చెక్కిలిపై చిలుకుతూ,
సుగందాన్ని నాసికలకు అందిస్తున్నాయి.
శాసనసభ్యుల,మంత్రివర్యుల మార్గమైతే,
ఈ మురికి నోళ్ళు మూతపడుతున్నాయి,
రాచమార్గం రంగవల్లులు అద్దినట్లుంటుంది.
అడిగేవాడూ లేడు,అడ్డుకొనేవాడూ లేడు,
ముక్కుమూసుకొని మురికి తొక్కుకుంటూ,
మూసీనదిలో ఈదుతున్నామనుకోకు.
ఓటు అడగటానికి ఈ బాటనే కదా వస్తారు?
కారులేకుండా కాలి నడకన రమ్మని చెప్పు.
ముప్పుతెచ్చే ఈ మృత్యుకుహరాలను మూసివేస్తే.....ఓటు వేస్తానని చెప్పు.
ఇలా ఎన్ని అక్షర సమూహాలతో చెళ్ళుమని కొట్టినా వారికి చీమ కుట్టినట్లినా ఉండదు.
ReplyDeleteరాతి శరీరమే కాదు రాతి మనసు కూడా ..
మీ ప్రశ్నించే గళానికి అభివందనం మేరాజ్
మీ ప్రశంసకు ధన్యవాదాలు వనజా.
Deleteఇలాంటి కుహారాలు నగరం నిండా బోలెడు.
ReplyDeleteఅనికేత్ గారూ, ధన్యవాదాలు
Delete
ReplyDeleteనిర్లక్ష్యం మురికి గుంటలు, మృత్యుగొంతుకలు తెరుచుకొంటూ నడిచేవారి నడ్డిని విరుస్తున్నాయి. అడిగే వాడు, అడ్డుకొనే వాడు లేడని ముక్కుమూసుకొని మూసీనదిలో ఈదేద్దాం అనుకోకు.
.......................
ఓటు అడగటానికి ఈ బాటనేగా వస్తారు? కారులేకుండా కాలి నడకన రమ్మని చెప్పు. ముప్పులా పరిణమిస్తున్న ఈ మృత్యుకుహరాల పరిసరాల్లో ఒక్క పూటైనా వుండి చూపిస్తే .... ఓటు వేస్తానని చెప్పు.
"మృత్యు కుహరాలు" కవిత ద్వారా వాస్తవ సమీకరణాల్ని సామాజిక స్పృహ ఆవశ్యకతను స్పష్టంగా కౌన్సిలింగ్ చేస్తున్నట్లుంది.
అభినందనలు ఫాతిమా(కవయిత్రి) గారు.
ఓ కవిగారు, నా కవితని మెచ్హుకున్నందుకు సంతోషముగా ఉంది.
Delete