Pages

Wednesday, 27 May 2015

" నీవు నా ప్రాణమే "








 " నీవు   నా ప్రాణమే "


బలాత్కరించబడ్డ  క్షణాలన్నీ....
బంధీలైన  గడియలన్నీ....,
నిఘా  వెనుక  భయాలన్నీ...,
జీవితం పై  దాడి  చేసే  వేళ ...



అగాథాల  అంబుధిలో ..,
విఘాతాల  వనాలలో ....
వసంతం పారిపోతుంటే ,
శిశిరం   వచ్చి  చేరుతున్న వేళ ,



నా కళ్ల మీదుగా   ప్రవహించే
నెత్తుటి  నదులను  తొలగించి ,
నిశి  రాతిరిని  పండువెన్నెలగా  మార్చిన ,
శరత్ చంద్రునివి   నీవు .




గుండెలకు  తుపాకులు  పెట్టినా ..,
చెదరని  విప్లవ  పక్షులు,
నా  మనో  గాయాలు ,



ఓ  సందిగ్ద  సాయంకాల  వేళ ,
చిక్కుపడిన    నా  ఆలోచనా  వల,
చలించిన  నా  మనో  కల ....,



ఉట్టికాళ్లతో    మండుటెండలో  నడిచే
పసిపాప   పాదాల     వేధన  నాది ,

కాలిన  పాదాలకు  నవనీతం  అద్ది,
అక్కున  చేర్చుకున్న అయ్యతనం  నీది,



ఎలా  సాద్యమైంది ,  నీకిదంతా ...?
ఎలా   దూరమైంది ,నా   వెతంతా...?



శరీరమంతా  రెండు  చేతులుగా  చేసుకొని,
కృతజ్ఞతతో  నీకు    నమస్కరిస్తున్నాను



6 comments:

  1. బ్యూటీఫుల్ పోయం

    ReplyDelete
  2. neevu naa praname chinna

    ReplyDelete
  3. దరి చేరకు , అంధకార దైన్యం !
    వెలిగించు, ఆశా దీపం !
    రగిలించు, విద్యుత్తరంగం !
    ప్రభవించు , నీ శక్తి స్వరూపం !
    నీ ధైర్యం, అసామాన్యం !
    నీ జీవితం, అమూల్యం !

    ReplyDelete