చూడనీ ఓసారి.
గులాబీ రేకులు విడివడి జంటగా చేరినట్లున్న ఆ ఆధారాలను . . .
అలరించనీ ఓసారి.
కొలనులో మిలమిలలాడే మీనంలా ఉన్న ఆ నయనాలను
సిగ్గుతో ఎర్రబడిన ఆ అద్దాల చెక్కిళ్ళను . . . . . . . . . . . . . . . . . . .
కననీ ఓసారి.
ఫాలభాగంపై పరుచుకున్న ముంగురులనూ
మదిలోని ప్రేమ వెలిగి కాంతులీను కనులనూ . . . . . . . . . . . . . .
కాంచని ఓసారి.
సిగ్గుల మొగ్గవై అడుగులు తడబడుతుంటే నర్తిన్చేలా ఉన్న నీ నడకను
ఎదురుచూపులు దాచుకుంటూ దొరికిపొఇన నీ తడబాటును . . . . .
చూడనీ ఓసారి.
కోటి వీణలు మీటినట్లున్న నీ పలుకు కనకపు కంఠాన్ని దాటి రావటం . . . . .
విననీ ఓసారి.
కోమలమైన నీ హృదయం నుండి జారిన ప్రతి అమృతపు చినుకులలో . . . . .
తడవనీ ప్రతిసారి.
(మల్లెపందిరి మాసపత్రిక మే నెల సంచికలో ప్రచురితం)
(మల్లెపందిరి మాసపత్రిక మే నెల సంచికలో ప్రచురితం)
మీరు రాసిన కవితలు బాగున్నాయి. కవితా హృదయాన్ని ఆవిష్కరింపజేస్తున్నాయి. "కోమలమైన నీ హృదయం నుండి జారిన ప్రతి అమృతపు చినుకులలో..తడవనీ ప్రతిసారి" అనడం ప్రస్తుత పరిస్థితులో ఆడవారు ఇంతగా ప్రేమిస్తారా! అని మగవారిని ఆలోచింపజేసేలా ఉంది. సమాజానికి తగిన మోతాదిది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ReplyDeletemeraj fathima....
ReplyDeletemeru GAZALS rayagalaru anipinchindi...
raasaremo...teliyadu.... padalalo...virupu.... paadaalalo merupu.... pushkalam ga uunai .... inkenduku aalasym padandi munduku.... Gazals..tayaaru cheyandi....vinduku....
all the best....
chaalaa baagundi fathima begumji...
ReplyDeletethank you varmaji
ReplyDelete