మాకు ఆకలేస్తుంది.
అన్నదాతా..... మాకు ఆకలేస్తుంది,
కానీ నీ ఇంట అన్నంకుండ ఖాళీగా ఉంది.
కృషీవలా... మాకు దాహమేస్తుంది.
కానీ నీ ఇంట కన్నీరే దొరుకుతుంది.
మా శిశువులకు పాలు లేవు,
కానీ నీ ఇంట పాడి పాడేక్కింది.
రైతన్నా...,
కాలిపోయిన కలలు శాశ్వతం కాదు,
రాలిపోయిన కంకులే ఏరుకుందాం.
గుప్పెడు గింజల పలహారమే చాలు,
గుక్కెడు నీటితో గొంతు తడుపుకుందాం.
కరవు రక్కసి కాళ్ళు విరిచేసి,
కలో, గంజో అందరమూ కలసి తాగుదాం.
మట్టిపొరల కింద బంగారముంది,
తట్టి చూడు చిరుమోలకై పైకివస్తుంది.
గొంతులో గరళాన్ని పోసుకోకు,
గుండెలో ఆశల గూటిని కట్టుకుందాం .
ఉరికొయ్యకు వరి కంకుల ఉట్టి కట్టు.
ఊరపిచ్చుకల దీవెనలకై దోసిలి పట్టు.
ఆశల మడిని ఎండిపోనీయొద్దు ,
ReplyDeleteచిరు ఆశల మొలకలను కాపాడుకుందాం .
తప్పకుండా..దేవీ.
Deleteచిరుప్రాసల కవితతో ఆకలి మాయమయ్యేలా చేసారు :-)
ReplyDeleteపద్మా.., ధన్యవాదాలు.
Deleteమట్టిపొరల కింద బంగారముంది,
ReplyDeleteతట్టి చూడు చిరుమొలకై పైకివస్తుంది. ..
రాజీ గారూ, బహుకాలదర్శనం , ధన్యవాదాలు.
Deleteఅన్నదాతా! ..... నీ ఇంటే అన్నంకుండ ఖాళీగా ఉంటే మా ఆకలి తీరేదెలా?
ReplyDeleteకృషీవలా! .... నీ కన్నే వర్షిస్తుంటే, నీ ఇంటే పాడి పాడేక్కితే మా దాహం తీతీరేదెలా? మా శీశువులకు పాలెలా?.
రైతన్నా..., రాలిన కంకులేరుకుని, గుప్పెడు గింజల పలహారం తిని, వీధి పంపు నీటితో గొంతు తడుపుకుని, కలో, గంజో కలసి తాగుదాం.
మట్టిపొరల కింద బంగారముంది తట్టి చూస్తే చిరుమొలకై పెరిగొస్తుంది. గొంతులోగరళాన్ని పోసుకోకు,గుండెలో ఆశల గూటిని కట్టుకుందాం .
ఎంత చక్కని చిక్కని భావనావేశం సామాజిక స్పృహ కవిత గా
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!
చంద్రసర్, ధన్యవాదాలు.
Delete" కాలిపోయిన కలలు శాశ్వతం కాదు,
ReplyDeleteరాలిపోయిన కంకులే ఏరుకుందాం.
గుప్పెడు గింజల పలహారమే చాలు,
గుక్కెడు నీటితో గొంతు తడుపుకుందాం. "
'మాకు ఆకలేస్తుంది' లో ఆకలి బాధల్ని
ఎంతో చక్కగా చెప్పారు,
ఇలాటి కవితలను అందించడంలో
మీకు మీరే సాటి ఫాతీమా గారు .
అభినందనలు.
*శ్రీపాద
శ్రీపాద గారూ, ధన్యవాదాలు.
Deleteకవిత గుండెలను తట్టి లేపుతోంది.
ReplyDeleteసర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
Delete