Pages

Tuesday, 27 May 2014

నీవు.

   







   






   

నీవు.


నేను ఆర్తిగా వెతికే తీయని ం
జ్ఞాపకం నీవు.

తరాల నుండీ ఎడతెగని,
అన్వేషణ నీవు.

నిశిరాత్రి నిరీక్షణా వేదనకు,
వెన్నెల లేపనం నీవు .

అల్లరిగా అల్లుకునే కనిపించని,
సమీరం నీవు.

ఆగిపోతున్న గుండెకు ఊపిరిలూదే,
హృదయ స్పందన నీవు.

తలపులో తచ్చాడే అడుగుల,
సవ్వడి నీవు.

పలవరింతలలో పరుగిడే,
కలల రేరాజువు నీవు.

ఎప్పటికీ చేరువ కాని ,
ఊహల సుదూరం నీవు.

ఎదురు చూపులకు చిక్కక,
వెక్కిరించే ఎండమావి నీవు.











10 comments:

  1. నువ్వు....నువ్వు...నువ్వే...నువ్వు..........మీ
    అంతరంగంలోని ఆలోచనా తరంగాలు అలల్లా మాముందుకు చేరుకున్నాయి మీరజ్.

    ReplyDelete
    Replies
    1. మీరలా సముద్రములా ఉంటే తరంగాలు మీ దరినే కదా ఉంటాయి నెచ్చలీ..:-))

      Delete

  2. ఫాతిమా గారూ !
    ఎలా వస్తాయో ఇంత మంచి పదాలు మీ మనస్సు లోకి ..
    ఎంత ప్రయతనం చేసినా ఆ ఒరవడికి దగ్గరగా రాలేకపోతున్నా..
    మీ రచనలు నన్ను ఎప్పుడూ ప్రేరేపితం చేస్తూ..
    నాలో ప్రేరణను నింపుతాయి .

    ముఖ్యంగా
    "నేను ఆర్తిగా వెతికే తీయని
    జ్ఞాపకం నీవు.
    తరాల నుండీ ఎడతెగని,
    అన్వేషణ నీవు."

    నిరీక్షణ ఎంత మధురమైనది.
    మంచి భావనలతో అమూల్యమైన కవితనందించారు.

    "ఎప్పటికీ చేరువ కాని ,
    ఊహల సుదూరం నీవు.
    ఎదురు చూపులకు చిక్కక,
    వెక్కిరించే ఎండమావి నీవు."

    అంతలోనే ఎండమావిని చూపి గుండెను బరువుతో నింపారు .
    సుఖాంతం చేస్తారేమో అని అనుకున్నా !

    బరువుగా మారినా కవిత చాలా బావుంది .
    అభినందనలు ఫాతిమా గారూ .

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ స్పందంకు ధన్యవాదాలు శ్రీపాద గారూ,

      Delete
  3. "ఆగిపోతున్న గుండెకు ఊపిరిలూదే,
    హృదయ స్పందన నీవు."

    "ఎన్నో గొప్ప భావనల సమాహారమే నీవు"

    చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. రాజీ,చాలా కాలానికి కనిపించారు,
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. "ఎన్నో గొప్ప భావనల కవితా సుమహారమే నీవు"
    చాలా బాగుందండి...

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ, మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టటానికి వీలుకావటం లేదు, కామెంట్స్ తీసేశారా?

      Delete
    2. అవునండీ కామెంట్స్ తీసేశాను .. :)

      Delete