Pages

Saturday, 29 November 2014

మా (ర్పు) ర్చురీ












మా (ర్పు) ర్చురీ



కనిపించని  కుట్రలకూ,
కనికరించని  దుష్టులకూ,
కనుమరుగవుతున్న బాల్యం .

కుతంత్రాల  కుమ్ములాటలో,
అమాయకపు  అనాథ బాలికలు
అమ్ముడవుతున్న వైనం .

ఉన్మాదం  ప్రకోపించిన  రాక్షస బల్లుల
రక్కసి  గోళ్లకు  చిక్కుకునే,
ముక్కు  పచ్చలారని  ముద్దు గువ్వలు.


పాశవికత వెదజల్లే  నీచ ప్రవృత్తిలో,
అమ్మతనం  మరచిన  అసుర స్త్రీల కోరల్లో,
అరాచక  కబేళాలలో అమ్ముడవుతుందీ  ఆడమాంసం.

అనాగరిక  మైదానం లో, ఆటవిక  క్రీడల్లో,
తల క్రిందులై  వేలాడుతున్న  సమాజములో,

 రాత  నేర్చిన   మనమంతా....,


గమ్యం ఎరుగని పోటీలలో,
నిలకడలేని ఉఊగిస లాటల్లో,

ఊకదంపుడు ఉపన్యాస ఉచ్చులో,
ఎత్తిపోతల  ఎంగిలి  రొచ్చులో,

ఎవరి  శవం ముందు వారే  కూర్చుని ,
శవ  పరీక్షకై  నిరీక్షిస్తున్నాం.

బ్రతికి లేమని మనకి  మనమే...,
మరోమారు  నిరూపించుకున్నాం ...,





  

Saturday, 8 November 2014

నిషిద్ద గానం

















నిషిద్ద  గానం



పాత  సారా   కొత్త   సీసాలో  పోసినట్లు,
ఓట్లు బొక్కుతూనే  బూట్ల  కింద తొక్కబడుతుంది ,
"ప్రజా స్వామ్యం "


పంపకాల అంపకాల  తెర  దించగానే,
భేతాళుడి భుజం  మీద  మోయ బడుతుంది
" రాజకీయం"


కబ్జాల గిల్లికజ్జాలలో  జరిగి, జరిగి ,
చిరిగిన  చింకి పాతలా  వేలాడుతుంది,  
"రాష్ట్ర పటం ".



నాగళ్ళను విరిచి ,అడవుల్ని నరికి ,
ఉరికోయ్యల్ని తయారుచేస్తుంది,
"పాలక వర్గం"



నిషిద్ద జాడల్లో,మతం దాడుల్లో,కులపు నీడల్లో
నెత్తుటి జండాను ఎత్తుతుంది,
"ఉగ్రవాదం "




నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలవుతున్నా,
వమ్ము కాని నమ్మకం తో ఆశగా ఎదురు చూస్తుంది ,
" ప్రజానీకం "