నిషిద్ద గానం
పాత సారా కొత్త సీసాలో పోసినట్లు,
ఓట్లు బొక్కుతూనే బూట్ల కింద తొక్కబడుతుంది ,
"ప్రజా స్వామ్యం "
పంపకాల అంపకాల తెర దించగానే,
భేతాళుడి భుజం మీద మోయ బడుతుంది
" రాజకీయం"
కబ్జాల గిల్లికజ్జాలలో జరిగి, జరిగి ,
చిరిగిన చింకి పాతలా వేలాడుతుంది,
"రాష్ట్ర పటం ".
నాగళ్ళను విరిచి ,అడవుల్ని నరికి ,
ఉరికోయ్యల్ని తయారుచేస్తుంది,
"పాలక వర్గం"
నిషిద్ద జాడల్లో,మతం దాడుల్లో,కులపు నీడల్లో
నెత్తుటి జండాను ఎత్తుతుంది,
"ఉగ్రవాదం "
నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలవుతున్నా,
వమ్ము కాని నమ్మకం తో ఆశగా ఎదురు చూస్తుంది ,
" ప్రజానీకం "
రాజనీతి పై మీ అస్త్రం బాగుందండి.
ReplyDeleteనిషిద్ధ గానం గట్టిగా వినిపించారు.
ReplyDeleteమీ తెగువకు
ఆ తెలుగుకు జోహార్లు
అస్త్రం బావుందండి
ReplyDelete