Pages

Saturday, 25 October 2014

అక్షరాయుధాన్నై ...,







    అక్షరాయుధాన్నై ...,

    చిక్కుముడి   సమాజ  సమస్యలకు ,
    సులువైన  మార్గాన్వేషినై ....,

    పగిలిన అడ్డం ముక్కలను ,
    అతికించే   ఐఖ్యతా  సూత్రాన్నై....,

    కీచులాటల   కీచకులను ఏకం చేసే,
    సామూహిక  సంఘటిత  శక్తినై....,

    జనన,మరణ దృవాల  మద్య ,
    సుఖ,దు:ఖాల  అయస్కాంత  ఆకర్షణనై ....,

    అచ్చిరాని   అనుబంధ అఘాదాల మద్య,
    మానవీయ  వారదినై..., 

    జనం గుండెల్లో జెండాగా ఎగురుతూ ,
    అట్టడుగు వర్గాల  ఆకలి కేకనై...,

    మనుషుల మద్య  విస్తరించే  రాక్షస,
    నిశ్శబ్దాన్ని పారద్రోలే  లిపి ఘోషనై ...,

    సరికొత్త   జీవనపేజీ కై  వెతికే ,
    అనంతాన్వేష  అవిశ్రాంత  అక్షరాన్నై...,

    తప్పుడు   తలకట్టుల   తలలు కొట్టే,
    చప్పుడు చేసే (శబ్ద)  యుద్ద  కవిత్వభేరి  మోగిస్తున్నా......  

   


  

8 comments:

  1. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని అవిశ్రాంతంగా పోరాడుతున్న మెరాజ్ గారి పటిమకు అభినందనలు .

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Delete
  2. అది మీ ఆయుధమే మీరజ్ , చాలా బాగుంది మీ కవిత .

    ReplyDelete