చేజారిన నా కలం
అంతులేని సమస్యల సుడిగుండములో ..
పడిపోయిన నా కలం,
భాద్యతల అక్షరాలను బాదల గాయాలనుండి ,
పొడిచి,పొడిచి వెలికి తెచ్చేది,
మనస్సు మర నుండి మాటలను తూటాలుగా చేసి ,
సూటిగా మీ గుండెలకే సందించేది,
ఎక్కడికి పోయిందో ........ ,
చంటోడి ఆకలికై పోరాడుతూ ..,
అమ్మ గుండెలపై పారాడు తుందా ?
కుంటోడి అంగవైకల్యానికి ఆసరాగా,
ఏ చెమట చెట్టున ఇరుక్కుందో..?
రైతన్న అప్పుల పద్దులు రాస్తూ..,
మొలకెత్తని పుచ్చువిత్తనమై పెళుసుబారిందా...?
కరకు పాళీగా నా కుత్తుకపై కూర్చుని ,
రగిలిపోయే నా దిగులు గుండెకు
కాసిన్ని అక్షరాలనిచ్చి సేద తీర్చేది........... ఎక్కడికి పోయిందో....!!
ReplyDeleteచాలా బాగున్నాయి .
చంటోడి ఆకలికై పోరాడుతూ ..,
అమ్మ గుండెలపై పారాడు తుందా ?
రైతన్న అప్పుల పద్దులు రాస్తూ..,
మొలకెత్తని పుచ్చువిత్తనమై పెళుసుబారిందా...?
అన్నయ్యా..మీరే చెప్పాలి .
Deleteచాలా బాగుంది.
ReplyDeleteసర్, ధన్యవాదాలు
Deletechejarina kalam malli dorukuthundi kani kaalam thirigiraduga aa kaalanne thirigiteccukunna neeku kalam chejarina thirigi vethukkuntu vastundi thammudu chinna
ReplyDeleteచేజారిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేదు కానీ, నా కలంతో కాలాన్ని తిప్పుకోగలిగాను ,
ReplyDeleteసుదా ,(తమ్ముడూ) ఎలాఉన్నావు ?
కలనైనా నిదరోక , కలికాలంపై కత్తులు దూస్తూ , కన్నీటి వ్యధలను అంతమొందించ మీ కరమును , మిము కలకాలం వీడక మీతోనే జీవితమనే మీ కలాన్నిలా...............మీరజ్.......
ReplyDelete