రిక్త హస్తాలు
అయినవారికి తాంబూలం
అందించిన ఈ హస్తాలు ,
నేడు అలసి సొలసిపోయిన తమలపాకులు .
వారసత్వపు దానగుణం
హస్తరేఖల్లో అమరిన ఈ హస్తాలు,
ఆశగా చాపిన ప్రతి చేతినే తడిపే కర్ణుని కరాలు ,
అన్నదాతగా పట్టెడన్నం పెట్టే
ఆత్మీయ ఈ హస్తాలు ,
అన్నార్తుల ఆకలి తీర్చే అక్షయ పాత్రలు .
చీకటిని పారద్రోలే చిరు దివ్వెలకు ,
రక్షణ నిచ్చే ఈ హస్తాలు,
జగతినే జాగృతి చేసే శుభసూచకాలు,
సంతానానికి సంతోషాన్నిచ్చె,
అమ్మతనపు ఈ హస్తాలు,,
నిద్రపుచ్చే ఊయలలు ,
కరవు కాటకాల, ఆర్దిక ఆటుపోటులకై ,,
తెగిపడిన ఈ హస్తాలు ,
నేడు అడుగంటిన అక్షయ పాత్రలు .
ఓ నాటి ఆ హసతాలు ఈ నాడు నిజ్జంగా రిక్త హస్తాలే .
ReplyDeleteనైస్.
" అడుగంటిన అక్షయ పాత్రలు ."
ReplyDeleteఒక్క మాటలో మొత్తం చెప్పేసారు. బాగుంది