Pages

Thursday, 16 October 2014

పరాదీనులై ...

         





        పరాదీనులై ...

        అనేక   రూపాల   సమూహం   స్త్రీలు,
        అమ్మతనానికి   ఆనవాళ్ళు  వీళ్ళు.

       పలకరింపుల  తొలకరింపులకే ..,

       పరవశించే  పసి మనస్సులై..,

       మాయల మాటల  తూటాలకే ,

       గాయపడే మానసిక  క్షతగాత్రులై ,

       చీకటి రసాయనాలకు  సమీకరణాలై,

       వెలుగు  తగిలిన   తీసివేతలై...

       వ్యక్తిత్వాన్ని అమ్ముకొనీ,తప్పుడు వ్యక్తిని నమ్ముకొనీ,

       వెలితి గుండెలను  పిచ్చి  బ్రమలతో బర్తీ చేసుకొని

       రంగుల,హంగుల మెచ్చుకోలుకై ,

       మలినమంటిన హృదయ కరచాలనాలకై ,

       భరించలేని  బంధనాలను  వదలి ,

       ఊపిరి  తీసే  ఊహల  పల్లకి నెక్కి,

       పవిత్రమైన స్త్రీ(వ్యక్తి) త్వాన్ని అపాత్ర దానం చేసి ,

       పరహీనులై    చలన   రహితం   కాకండి....,  



  

5 comments:

  1. చాలా సున్నితమైన అంశం. బాగా చెప్పారు.
    శుభాభినందనలు.

    ReplyDelete
  2. చక్కటి సందేశం .

    ReplyDelete
  3. ఇంత బాగా మీరే చెప్పగలరు మీరజ్.......

    ReplyDelete