Pages

Saturday, 29 November 2014

మా (ర్పు) ర్చురీ












మా (ర్పు) ర్చురీ



కనిపించని  కుట్రలకూ,
కనికరించని  దుష్టులకూ,
కనుమరుగవుతున్న బాల్యం .

కుతంత్రాల  కుమ్ములాటలో,
అమాయకపు  అనాథ బాలికలు
అమ్ముడవుతున్న వైనం .

ఉన్మాదం  ప్రకోపించిన  రాక్షస బల్లుల
రక్కసి  గోళ్లకు  చిక్కుకునే,
ముక్కు  పచ్చలారని  ముద్దు గువ్వలు.


పాశవికత వెదజల్లే  నీచ ప్రవృత్తిలో,
అమ్మతనం  మరచిన  అసుర స్త్రీల కోరల్లో,
అరాచక  కబేళాలలో అమ్ముడవుతుందీ  ఆడమాంసం.

అనాగరిక  మైదానం లో, ఆటవిక  క్రీడల్లో,
తల క్రిందులై  వేలాడుతున్న  సమాజములో,

 రాత  నేర్చిన   మనమంతా....,


గమ్యం ఎరుగని పోటీలలో,
నిలకడలేని ఉఊగిస లాటల్లో,

ఊకదంపుడు ఉపన్యాస ఉచ్చులో,
ఎత్తిపోతల  ఎంగిలి  రొచ్చులో,

ఎవరి  శవం ముందు వారే  కూర్చుని ,
శవ  పరీక్షకై  నిరీక్షిస్తున్నాం.

బ్రతికి లేమని మనకి  మనమే...,
మరోమారు  నిరూపించుకున్నాం ...,





  

1 comment:

  1. అవును సుమా!
    కళ్ళ ముందే ఇన్ని దారుణాలు జరుగుతున్నా
    ఏమీ చేయని జడ పదార్థంలా ఉంది సమాజం.
    మౄతసమానమే మరి!!

    ReplyDelete