Pages

Wednesday, 24 December 2014











నా  నగరం

నాకు  అందకుండా పెద్దద,పెద్ద
అంగలేసుకుంటూ  వెళ్తుంది నా నగరం .

ఎత్తైన  మేడలు ఎక్కుతూ ..,
కత్తి  మీద సాముచేస్తూ   కవ్విస్తుంది ,

రాత్రయితే   జిగేల్మనే  రాకెట్టులా..,
పబ్బుల్లో పైటజార్చి,  క్లబ్బుల్లో పేకజారుస్తుంది.

అర్దరాత్రి  దండాలకు అడ్డాగా  మారి ,
అక్రమాల శవాన్ని  భుజానమోసే విక్రమార్కుడవుతుంది.

కన్నబిడ్డలకు అన్నప్రాస  చేయటానికి ,
అన్నదాతను  అనాదను   చేస్తుంది .

అమ్మ,అయ్యా లేని  అనాథ నా నగరం ,
అన్నీ ఉన్నా  ఏమీ లేని   అభాగ్య నగరం.

తలారి పాలకులకు తల తాకట్టు పెట్టి,
ఏలుకొనే నాదునికి    తాళి   లేని   పెళ్ళాం   నా నగరం .






4 comments:

  1. Telugu lo rayadaniki
    http://alllanguagetranslator.blogspot.in/2013/05/blog-post.html

    ReplyDelete
  2. తలారి పాలకులకు తల తాకట్టు పెట్టి,
    ఏలుకొనే నాదునికి తాళి లేని పెళ్ళాం నా నగరం

    మరీ కారాలూ మిరియాలూ నూరుతున్నారే! :)

    ReplyDelete
  3. The year is coming to an end.
    I hope you will welcome the NEW year with
    hope and passion for Poetry.
    Wish You and Your Family
    Happy, Healthy and Prosperous NEW year

    ReplyDelete
  4. మన నగరం ఇంత భయంకరంగా ఉందన్నమాట! బాగాచెప్పారు.

    ReplyDelete