మతలబుల మతాబులు
పురుషం అంటే
కత్తిపట్టుకొని,
కదను తొక్కటం కాదు.
అన్నార్తులకు అండగా నిలిచే అక్షరాయుధం కావటం.
విద్యాధికులంటే,
పట్టాలు బుట్టలకొద్దీ
కలిగి ఉండటం కాదు ,
నిరక్షరాసులకు నీడగా అక్షర ఆదరణ కావటం.
సంస్కారం అంటే,
వంశి వృక్షము నుండి
తెంచుకొనేది కాదు,
వినయ, విదేయతలతో పెద్దలయెడ ఒదిగి ఉండటం.
సహాయం అంటే,
అన్నార్తులకు ,
ఎంగిలి చేయి విదల్చటం కాదు ,
పెంతందారీ నిప్పుల వంతెనపై ఉప్పెనై పోటెత్తటం.
పెంతందారీ నిప్పుల వంతెనపై ఉప్పెనై పోటెత్తటం.
ReplyDeleteilaa endukandee?
maamooluga sahaayam cheyakoodaa?
daanni sahaayam manaraa?
hari podili