గాయమైన గేయం
నీ కోసం ఎదురుచూసే సమయాన,
రాలేననే నీ సందేశం.
సాలెపురుగులా ఊహల దారాన్ని అల్లే తరుణాన,
విరిగిపడిన ఇంటి చూరు.
జీవించే క్షణాలనే మరచి పోతున్న కాలాన,
తలపులను తవ్వుతూ.
చిరు పలుకుల కోసం తపించే మదిలోన,
చెరిపివేసే వాగ్ధానం.
నిరీక్షణ లో నుంచి ఉన్మత్త ఆవేశాన,
చటుక్కున నోరు జారిన పలుకులు.
మేఘాల ముంగురులు సవరించే నిముషాన,
పడమటి కొండల్లోకి జారిపోతూ.
రాతి పలకపై ప్రేమాక్షరంలికించే క్షణాన,
జారిపడి పగిలిన గుండె శకలాలు .
చలన రహిత నీడలే పలాయనమైన వైనాన,
మూగబోయిన గుండె నిండా గాయమైన గేయాలే.
చాలా బాగుంది. ఏమైంది చిరు తలపులకు ?
ReplyDeleteసర్, చాలా కాలం తరువాత మీ చిరుపలుకు,బహుశా బిజీ అనుకుంటా,
Deleteచిరుపలుకుల తల్పుల నా కవిత నచ్చి నందుకు నా ధన్యవాదాలు.
మూగబోయిన గుండె నిండా గాయమైన గేయాలే.
ReplyDeleteఆవేదనగా వినబడుతూనే ఉన్నాయి.
బావుంది ..మీ గేయానికి అంత శక్తి.
మీ స్పందన నా కవిత కు ప్రాణం పొస్తుంది, వనజా ధన్యవాదాలు.
ReplyDeleteమంచి ఫీల్ ఉన్న కవిత...బాగుంది
ReplyDeleteకవిత నచ్హినందుకు థాంక్స్ డేవిడ్ గారు.
Deleteసాలెపురుగులా ఊహల దారం అల్లి, నీ చిరు పలుకుల కోసం తపించి, రాతి పలకపై ప్రేమాక్షరంలా లికించుకున్న క్షణాన, జారిపడిన గుండె శకలాలు మూగబోయిన గుండె గాయాలు గేయాలయ్యినట్లు ....
ReplyDeleteఅక్షరాల శక్తి ని పదభావనల్లో చూస్తున్నా!
అభినందనలు ఫాతిమాగారు!
గుండె నిండా గాయమైన గేయాలే, కానీ పలకరించే నేస్తం ఉన్నప్పుడు అవన్నీ మాసిపోతాయి.
Delete