కల్లు తాగిన కారుకూతల్లో
తన తల్లినే పతితగా వింటుంది.
కట్న కానుకలు తక్కువనే కరకునోళ్ళకు ,
జడిసి తల వంచుకుంటుంది.
ఆడపిల్లని కన్నావని తూలనాడినా,
తప్పు తనదే అనుకుంటుంది.
బిడ్డల నడవడిక బాగలేకున్నా,
తానే కారణమంటే నిజమే అనుకుంటుంది.
యెడారి ప్రస్తానంలో తీరని దాహాల వెంట,
పరుగులెడుతూనే ఉంది.
నడివయస్సులో కూడా తనవారికోసం,
పడిలేస్తూ పనిచేస్తూనే ఉంటుంది .
కన్నకూతురికి పెళ్ళి చేసి ,
తనలాంటి రాత వద్దని మొక్కుకుంటుంది.
కోడలి నాగరికత ముందు,
నిశాని అయిన తానే తలఒగ్గుతుంది.
అందరిలో ఉన్నా ఒంటరితనం,
తన తప్పులేకున్నా నిందమోసేతనం.
ఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,
అమ్మ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
అమ్మ తనం ని బాగా ఒడిసి పట్టుకుని చెప్పారు మెరాజ్ . అమ్మ గురించి అమ్మకే కదా తెలుసు .
ReplyDeleteఎలా ఉన్నారు? ఈ మధ్య సరిగా బ్లాగులలో ఉండటం లేదు . చాలా రోజుల తర్వాత మీ బ్లాగ్ చూడటం ఆనందకరం .
వనజా మీ స్పందనకు ధన్యవాదాలు,బాగున్నాను మీరూ బాగున్నారని,ఉండాలని కోరుకుంటూ....మీ నెచ్హలి
Deleteబాగుందండి.
ReplyDeleteతరువులు కూడ అమ్మ లాగే నీడా ఇస్తాయి, పళ్ళూ ఇస్తాయి మౌనంగానే.
మెచ్హుకున్న మీకు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు బోనగిరి గారు.
Deleteచాలా రోజులకీ మళ్ళీ మీ కవిత.
ReplyDeleteఅమ్మ "గొప్ప" తనం మీ శైలి లో బాగా చెప్పారు. ఎంత చెప్పినా ఒకింత తక్కువే!
చిన్ని ఆశ గారూ, ఎన్ని రోజులకైనా మీ ప్రశంస సంతొషాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.
Deleteఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,
ReplyDeleteఅమ్మ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
ఈ కవితకు ప్రేరణ తెలియదు కాని, అమ్మను చల్లని నీడ నిచ్చేతరువుతో పోల్చారు. చాలా బాగుంది!
సర్, కవితకు ప్రేరణ ఎందరో అమ్మల అమ్రుతం వంటి అమ్మతనమే, మెచ్హిన మీకు నా ధన్యవాదాలు.
Deleteఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,
ReplyDeleteఅమ్మ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
మెరాజ్ గారు!
మీ భావప్రజ్ఞకు జోహార్లు ...
భారతి గారూ, నా భావాన్ని మెచ్హిన మీకు నా ధన్యవాదాలు
Delete"అమ్మ"ను గూర్చిన కవిత చాలా బాగుంది.
ReplyDeleteమీ ప్రశంసకు నా ధన్యవాదాలు అహ్మద్ గారు.
Deleteఅమ్మతనాన్ని చాలా అద్భుతంగా వివరించారు ఫాతిమ గారు.
ReplyDeleteడేవిడ్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
Delete"కల్లు తాగిన కారుకూతల్లో విచక్షణారాహిత్యాన్ని చూస్తుంది అమ్మ. అమ్మ యెడారి ప్రస్తానంలో తీరని దాహాల వెంట, పరుగులెయ్యగల శక్తిని సమకూర్చుకుంటుంది. ఓపిక ఉన్నా లేకపోయినా తనవారికోసం, పడిలేస్తూ పనిచేసే శక్తిని, కన్నకూతురికి అత్తారిల్లు అమ్మగారిల్లులా ఉండాలని .... కోరుకుంటుంది అమ్మ."
ReplyDeleteభూమాత సహనాన్ని మూటకట్టుకుని ఆ భూమినే మోస్తుంది అమ్మ.
అమ్మతనం ఒక తరువుతనం ఆ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
ఒక అక్షర సత్యం! అభినందనలు ఫాతిమా గారు.
అమ్మ కదా అందుకే కమ్మనైనది. మీ అభిమానానికి నా వందనాలు చంద్ర గారు
Delete