ఓ అందమైన సాయంత్రం
చల్లగాలిలా నీ ఆగమనం
యెదురు చూపుల అంతరం
వెలుగునిచ్చు సూరూడిలా
కనురెప్పల వాకిట వెలసిన
పారిజాత తోరణంలా
అనేక శిశిర గాడ్పుల అనంతరం
అరుదెంచిన ఆమనిలా
కోటి మొక్కుల తర్వాత
ఇల్లు చేరిన ఇలవేలుపులా
ఎడారి వేడిమి అనంతరం
చెంత చేరిన వాసంతునిలా
నిదుర మరచిన కనులకు
కరిగిపోని స్వప్నంలా
తరిగి పోని శుభ తరుణం లా
ఆకరి శ్వాస వరకూ తోడుండే నేస్తంలా .
అందమైన భావన చేసారు. కవిత చదువుతుంటే
ReplyDeleteఅప్పుడే అయిపోయిందా అనిపించింది. కాని అది ఆగమనమం మాత్రమే అని,
కవిత ఒక అమూల్య బంధం అని చూసి
ఇది అయిపోలేదు అనుకున్నా!
అక్షరాలా నిజం, అమూల్యమైన బంధాలెప్పుడూ ఆగిపోవు. మన బ్రతుకును నడిపించేది ఈ అపురూప బంధాలే వీటి ఉనికే మనల్ని బ్రతికిస్తుంది . వాటికి మనం అపాదించుకొనే పేర్లు అనేకం ప్రేమ, స్నేహం, అనురాగం, ఆత్మీయతా... వగైరా. సర్, కవిత పై మీ విష్లేషణ బాగుంది. మీకు నా ధన్యవాదాలు
Deleteఓ అందమైన సాయంత్రం
ReplyDeleteచల్లగాలిలా, ఓ వెచ్చని సూరూడిలా
కనురెప్పల వాకిట వెలసిన పారిజాత తోరణంలా
.... ఆఖరి శ్వాస వరకూ తోడుండే ఓ నేస్తంలా ఓ అమూల్య బంధం
వెలకట్టలేని భావం .... ఎన్ని రూపాల్లో మనిషి మరో మనిషితో ప్రకృతితో బంధోన్ముకుడౌతాడో .... ఈ కవిత ద్వారా గొప్పగా చెప్పారు. అభినందనలు మెరజ్ ఫాతిమా గారు!
కవితని అన్నికోణాల నుండీ చూసిన మీ కవి హ్రుదయానికి నా ధన్యవాదాలు చంద్ర గారు.
Delete