"ఎడారితనం "
బోలీ,బొంతా నెత్తికెత్తుకొని,
ఊరూరా తిరుగుతూ,
అరిగిపోయే కాళ్ళతో,
తరిగిపోయే దూరాన్ని కొలుస్తూ.
చెట్టుకింద చదును చేసుకొని,
చిరుగు చీర ఊయలలూగుతూ,
అల్లరిగా ఆడుకుంటూ,
ఆకలీ జయించాలని చూస్తూ,
ఏ ఇంట దొంగతనం జరిగినా,
మమ్మల్నే వెతుక్కుంటూ ,
ఖాకీ లొచ్చి అమ్మా నాన్న బొక్కలిరగొట్టి,
బోనులో తోస్తే బైట బోరుమని ఏడుస్తూ.
శైధిల్య మబ్బుతెరల మాటున,
మిణుకు,మిణుకు మనే జాబిల్లిలా,
సుదీర్గ జీవితపు చీకటి నీడల్లో,
వెలుతురు వెతికే వంటరితనంతో.
నెత్తురు నాళాల్లో పరుగులు తీసే,
పసితనపు పవురుషాన్ని,
కట్టలు తెంచుకొన్న కోపాన్ని
వాస్తవానికి తెచ్చి వణికిపోతూ .
చిట్లిన అమ్మానాన్నల
అంగాంగాలను గుండెకు హత్తుకొంటూ,
అమానుషం అని అరవలేక,
ఎదిరించాలేకా ఏడుస్తూ..,
రుదిర స్నానిత శోఖితనై ,
హృదయ శఖలాల సమాదుల్లో
వెక్కిళ్ళ మద్య వెక్కిపడుతూ,
హరితహీన మోడులా విలపిస్తూ...
Really excellent,chaalaa rojula taruvata ee roaju mallee naa kallu chemarchaayi ,
ReplyDeleteరోహిణి గారూ, నా బ్లాగ్ కి స్వాగతం మీ ప్రసంశకు ధన్యవాదాలు.
Deleteఈ మీ ఆ వేదన సమాజంలోని దీనులైన దయనీయులపై చాలా బాగుంది .
ReplyDeleteసర్, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
Deleteటైటిల్ లోనే 90 మార్కులు కొట్టేసారు
ReplyDeleteసాగర్ గారూ, మీ ప్రశంస తో మిగతా పది కూడా కొట్టేసినట్లే..:-)
Deletechalaa baagaa vraasaaramdi
ReplyDeleteదేవి గారూ, సంతోషం మీ స్పందనకు.
Deleteకొన్ని పద ప్రయోగాలు
ReplyDeleteగాఢమైన భావాన్ని
కనులకు కట్టే
చిత్రాలుగా అమిరాయి.
అభినందనలు!
సర్, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
Delete