నీవు
అందని చందమామవైన నీవు
"పగటివెన్నెలైనావు"
నిరీక్షణా నిశీధిలో నీవు,
"నిశాచరవైనావు"
ఏకాంత వనాంతర విహారంలో నీవు,
"విహంగమైనావు "
సౌందర్య శోధనా సంచారంలో నీవు,
"విమలగాన్ధర్వమైనావు".
అందాల ఆమని ఆస్వాదంలో నీవు,
"వసంతుడివైనావు"
నిశ్శబ్ద మానస మందిరాన నీవు,
"మోహమూర్తివైనావు "
ప్రేమ భావనలో యుగాలు గడుపుతూ నీవు,
"ప్రణయ మూర్తివైనావు"
మేరాజ్ ! చాలా బావుంది,
ReplyDeletevanaja thank you.
Deleteచక్కటి భావ కవిత. చాలా చాలా బాగుంది మెరాజ్ గారు!
ReplyDelete