Pages

Wednesday, 21 August 2013

సముద్రమంత గాయం




సముద్రమంత గాయం 

నీకూ నాకూ మద్య ఆ అడ్డు గోడ ఏమిటి ?
నీవు చిరునవ్వు నవ్వితే
నేను ఉడుక్కోవటం

నీవు చేయి చాపి ఆహ్వానిస్తే,
నేను ముఖం తిప్పుకోవటం.

నీకూ నాకూ మద్య ఆ అడ్డుగోడ ఏమిటి? 

నేను వెన్నెలను దోసిట తెస్తే,
నీవు కన్నులను మూసుకోవటం.

నేను ఎదురు చూపును పరిస్తే
నీవు కను మరుగవటం.

నీకూ నాకూ మద్య ఆ అడ్డుగోడ ఏమిటి? 
కదలని కొన్ని క్షణాలూ,
నిదుర లేని కొన్ని రాత్రులూ.
కన్నీటి సంద్రాన మిగిలిన
కొన్ని వేదనా తరంగాలు

నీకూ నాకూ మద్య ఆ అడ్డుగోడ యేమిటి?
నీవు నన్ను గాయపరిచావు,
సముద్రమంతా గాయమది.

నేను నిన్ను వేదించాను,
ఆకాశమంత రోదన అది.

కరగని మౌనాలూ ,తరగని భింకాలూ,

చెరగని కోపాలూ, ఇవే మనం పేర్చిన ఇటుకలు .

8 comments:

  1. కవిత బాగుంది.
    గాయం మానాలి...
    రోదన తీరాలి...
    అడ్డు గోడ తొలగాలి.

    ReplyDelete
    Replies
    1. సర్, కవిత బాగుందన్నారు మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. ఇటుకలని పగులగొట్టండి. సముద్రమంత గాయం కి లేపనం పూయండి

    ReplyDelete
    Replies
    1. వనజా, మీ ఆత్మీయ స్పందనకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  3. ఆ అడ్డుగోడలో మీరిరువురూ పేర్చిన ఇటుకలే అని తేలింది గదా ! ఇక గాయం మానినట్లే , రోదన ఆగినట్లే , కరుగుతున్న మౌనాలు , తరుగున్న బింకాలు . మీ అడ్డుగోడ మటుమాయమైపోతున్నట్లే .

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా.., సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. వెన్నెలను దోసిట తెస్తే, కన్నులను మూసుకోవటం ఏమిటి?

    కన్నీటి సంద్రాన మిగిలిన కొన్ని వేదనా తరంగాలు ఇవి

    ఇవి కరగని మౌనాలూ, తరగని భింకాలూ, చెరగని కోపాలూ, ఇవే మనం పేర్చిన ఇటుకలు ఔనూ మనిషికీ మనిషికీ మధ్య ఈ అడ్డుగోడ ఏమిటి?

    సమాధానాలు వెదుక్కోవాల్సిన ఎన్నో ప్రశ్నలు వర్షం లా .... సమాజం ఇంకా ఆలోచించాల్సే ఉంది.
    ఒక అద్భుత భావావేశం .... అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete