బూచి..
పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో
కలిసిపోయి ఆడుకుంటూ...,
గాలిలో,దూళిలో కలతిరుగుతూ,
పావురంలా,పాలపిట్టలా ,గాలిపటంలా,
వేపచెట్టుకింద నేనూ,చిట్టీ,
మొగుడూ,పెళ్ళాం ఆట ఆడుతున్నాం.
నేను తొడలకంటిన మట్టి దులుపుతూ,
చెడ్డీలేకున్నా, పొడుగు చొక్కాచేతులు మడతపెడుతూ,
పనికెళ్తున్నా తలుపెసుకోవే.. అన్నాను దర్జాగా.
తలలో రిబ్బను పైటలా వేసుకొని,
పోట్టిగౌను ఎగ్గట్టుకొని, పప్పూ,ఉప్పూ తెండీ,
పిల్లగాళ్ళకు వన్నం వండుతా అన్నది చిట్టి,
అదిగో..అదిగో.. అదిగో అప్పుడొచ్చింది
బూచి.
అమ్మా, అయ్యా, తరిమేయలేని బూచీ,
తరాల తరబడి మమ్ము తన్ని తమాషా చూస్తున్న బూచి.
మా చిట్టి చేతుల్లో మట్టికొట్టి,
మా పొట్టలో జొరబడి మమ్ము పట్టి పీడించే బూచి.
ఎంగిలి ఆకులు నాకించి,
కుక్కలతో కరిపించి, కక్కిన కూటిని తినిపించే,
ఆకతాయి బూచి, అల్లరి బూచి,
మా వంటి వేలాది మందిని,
కబళించే బూచి, కాటేసే బూచి.
ఎన్నితరాలైన ఆయువు తరగని బూచి,
ఆకలి బూచి. అవును ఆకలి బూచి.
అవును నిజమే ఆకలి బూచాడే.....పిన్నలకి పెద్దలకి కూడా!
ReplyDeleteబయపెట్టేది ఆకలే, బయంకరమైనదీ ఈ ఆకలే... ధన్యవాదాలు మీ స్పందనకు పద్మ గారు.
Deleteఏడుపొస్తోంది...
ReplyDeleteఅలాంటి ఫీలింగ్ నుండి వచ్హినదే ఈ కవిత, మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
Deleteచాలా హృద్యంగా ఉంది. కన్నీరు తెప్పిస్తుంది.
ReplyDeleteమెరాజ్ గారు! ఈ మధ్య మీ పోస్ట్స్ చాలా మిస్ అయ్యాను. అందుకు కారణం ఈ క్రింద లింక్స్ చూస్తే మీకే అర్ధమౌతుంది. వీలు చూసుకొని మీ పోస్ట్స్ అన్నీ చదువుతాను.
http://smarana-bharathi.blogspot.in/2013/08/blog-post.html
http://smarana-bharathi.blogspot.in/2013_07_01_archive.html
భారతి గారూ, ఆలస్యంగానయినా చదివితే చాలు, స్పందించారు అదే చాలు. మీ అభిమానం నాకు తెలుసు.
Delete