Pages

Saturday, 24 August 2013

ఆత్మ వేదన






ఆత్మ వేదన 

నింగినున్న  సోముని అందుకోవాలనే  ఆశతో 
మసిబారిన  గుడ్డిదీపపు వెలుగులో 
ఎగిరే  మినుగురులా...

గమ్యం  ఎరుగని  నడకని ఆశ్రయిస్తూ.. 
తొణికిన హృదయాన్నీ, వలికిన కన్నీళ్ళనీ..,
ఆశ్రయించిన  అనామికలా.. 

విషాద ,నిశీద,సిధిల  జ్ఞాపకాలతో ... 
సాయం సంద్యల  మసక వెలుతురులో.. 
ఎదురుచూసే అభిసారికలా... 

పరిచిత పాద ముద్ర సవ్వడి కై  చూస్తూ... 
కలల  అలలపై  ఊహల,ఊయలూగుతూ... 
చలించని చెకోరంలా..... 

సహారా ఎడారుల ఇసుక  తుఫానులో.. ,
ఎండమావుల వెంట  సాగిపోతూ...,
అలమటించే దాహార్తిలా... 

నిత్యం ఉరకలెత్తే  జ్ఞాపకాల  పరుగులలో
నీడని  సైతం  అందుకోలేని నిరాశతో..,
నిర్భాగ్యపు పరాజితలా.. 

సదా సలిపే  రాచపుండు మనస్సుతో..,
నిర్దయ హృదయ  ఘోషపు పోరులో...,
గాయపడ్డ క్షతగాత్రిలా... 

దిగులుతో, గుబులుతో, నిరాశతో.. 
మది కాగితంపై  అక్షరించలేని అనాశక్తి తో..,
వొలికిన  సిరా మరకలా... 

నిరాశామయ  ఛీకటి  వనాలలో..,
ఆశల  కన్నుల  దివిటీలతో వెదుకుతూ ...,
అలుపెరుగని అన్వేషిలా.....

శిశిరములో ఎడారి తెరువరియై  సాగుతూ..., 
నీ మార్గం  శత వసంతం  కావాలని కోరుతూ..,
దీవించే అమ్మలా... 

విధి  వధ్యశిలపై  తల ఉంచి  చిరునవ్వుతో...,
మరుజన్మలో కూడా  నీ మైత్రిని  కోరుతూ..,
మౌనిలా...,విరాగిలా...,తాపసిలా....  








6 comments:

  1. శిశిరములో ఎడారి తెరువరియై సాగుతూ...,
    నీ మార్గం శత వసంతం కావాలని కోరుతూ..
    దీవించే అమ్మలా...

    విధి వధ్యశిలపై తల ఉంచి చిరునవ్వుతో...
    మరుజన్మలో కూడా నీ మైత్రిని కోరుతూ...
    మౌనిలా... విరాగిలా... తాపసిలా.....

    చాలా చక్కగా ఉంది ఈ ఆత్మ ని'వేదన' మెరాజ్ గారు.
    అలవోకగా మదిలో కదిలాడే భావాలను సరళమైన పదాలతో స్మృశిస్తూ వ్యక్తీకరించే మీ శైలి అద్భుతం.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  2. విధి వధ్యశిలపై తల ఉంచి చిరునవ్వుతో...,
    మరుజన్మలో కూడా నీ మైత్రిని కోరుతూ..,
    Nice to hear.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మగారు.

      Delete
  3. విషాద, నిశీద, సిధిల జ్ఞాపకాల సాయం సంద్యల మసక వెలుతురులో .... అభిసారికలా ....
    ఎడారి తుఫానులో ... .ఎండమావుల వెంట సాగిపోతున్న .... దాహార్తినిలా ....
    దిగులు, గుబులు, నిరాశతో .... మది కాగితంపై అక్షరించలేని అనాశక్తి .... వొలికిన సిరా మరకలా....
    విధి వధ్యశిలపై తల ఉంచి చిరునవ్వుతో....మరుజన్మలోనూ నీ మైత్రినే కోరుతున్న.... మౌని, విరాగి, తాపసిలా....

    ఆమె ఒక అమ్మ, ఆమె ఒక ఆలి ఆమె స్త్రీ మూర్తి. అన్నీ తెలిసిన ఒక ప్రేమ మూర్తి ఒక మమతానురాగాల అమ్మ మనోభావనల్నే అక్షీకరించినట్లుంది ఈ ఆత్మ వేదనలో. స్త్రీలో ఆదిశక్తి స్వరూపమూ ఉంది.
    హృదయపూర్వక అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. ఈ కవితావేదనని అర్దం చేసుకొనేందుకు సున్నిత మనస్కులై ఉండాలి. నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete