గుండెను తట్టి చూడు,
తలపుల తడి తగుల్తుంది.
మనస్సును తవ్వి చూడు,
వలపుల వేడి తెలుస్తుంది.
కళ్ళను కళ్ళతో కలిపి చూడు,
చూపుల సఫలం కనిపిస్తుంది.
ప్రాణాన్ని ప్రేమించి చూడు,
మృత్యువుతో పోరాడుతుంది.
జన్మను తరచి చూడు,
జాతిగూర్చి అడుగుతుంది.
ప్రేమసాగరాన్ని ఈది చూడు,
లంగరు అవసరమే లేదంటుంది.
రక్తాన్ని మరగించి చూడు,
అగమ్యమై ఆహా కారం చేస్తుంది.
లోకాన్ని ప్రశ్నించి చూడు,
అహంకార పైత్యాన్ని అంటగడుతుంది.
రాత్రిని కదిపిచూడు,
కలల దుప్పటి కప్పుతుంది.
సమాదిని గమనించి చూడు,
నీ మదిలాగే అనిపిస్తుంది
ఔనా?నిజమేనా?
ReplyDeleteకాదంటారా ?...యేమో మరి.:-)
DeleteWow....came back with your style. Nice to read this.
ReplyDeleteపద్మ గారూ, మీ స్పందనే నేను సంతొషంగా రాయటానికి కారణం, మనస్పూర్తిగా ధన్యవాదాలు మీకు.
Deleteనిజమే కదూ. చూడాల్సినవి ఎన్నో ఉన్నా చూడాలనుకునే వాళ్ళే లేరు!
ReplyDeleteనిజమే సర్ , చూసే దృష్టీ ఒకలాగే ఉండదు కదా,
ReplyDeleteఏంటో ఇలా చూస్తూ అడుగుతూ బ్రతికేస్తున్నాం :-)
ReplyDeleteకదా..,అర్దం చేసుకోరూ...:-) సృజన గారు ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteప్రాణాన్ని ప్రేమించి చూడు,
ReplyDeleteమృత్యువుతో పోరాడుతుంది... inspiring lines Madam.. kudos..
వర్మ గారూ, కవిత మెచ్హిన మీకు నా ధన్యవాదాలు.
Deleteతరచి చూడు, మది తలుపులను తెరిచి చూడు ... సత్యమేమిటో తెలుస్తుంది అన్న పెద్దల మాటకు దర్పణం పడుతుంది మీ ఈ కవిత.
ReplyDeleteమనస్సును తవ్వి చూడు, వలపుల వేడి తెలుస్తుంది. ...... ప్రాణాన్ని ప్రేమించి చూడు, మృత్యువుతో పోరాడుతుంది. .... లోకాన్ని ప్రశ్నించి చూడు, అహంకార పైత్యాన్ని అంటగడుతుంది.
ReplyDeleteప్రతి ట్విన్ ఒక మణి లా మెరుపులా కవయిత్రి కళ్ళతో చూడాలనిపిస్తూ .... "చూడు" కవిత చాలా బాగుంది.
అభినందనలు ఫాతిమా గారు!