నిషిద్ధ గానం
ఆహ్వానించలేదు.... అయినా అరుదెంచావు.
త్యజించ లేదు... అయినా నిష్క్రమించావు.
మనస్సు వుంది ...... అయినా మరబోమ్మని చేశావు.
అలుపనేది ఎరుగను.... అయినా సేదతీర్చావు.
వులిదెబ్బలు ఎరుగను... అయినా శిలను చేశావు.
ఎల్లలు ఎరుగను .... అయినా వెలివేశావు.
ప్రేమ కావ్యం రాశాను ..... అయినా నిషేదించావు.
కలవో,కల్పనవో ఎరుగను.....అయినా కనికట్టు చేశావు.
బ్రతుకుపై తీపి ఎరుగను ......అయినా సజీవ సమాది చేశావు.
విరాగిలా మిగిలాను..... అయినా బ్రతకాలనే కసి నాలో పెంచావు.
నీ చేతిలో చచ్చాకే తెలిసింది బ్రతుకంటే ఏమిటో.....అయినా ఎప్పటికీ గుర్తుంటావు.
జీవితం నేర్పే పాఠాలు చేదుగానే ఉంటాయి.
ReplyDeleteకాని జీవించడంలో మాధుర్యం మరిదేనిలోనూ ఉండదు అన్న సత్యాన్ని,
ఎంత వైవిధ్యంగా ఆవిష్కరించారు !
బాగుంది !!
నిజమేకదా జీవించటమే ముఖ్యం. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteవిరాగిలా మిగిలాను..... అయినా బ్రతకాలనే కసి నాలో పెంచావు
ReplyDeleteవద్దనుకున్నది జరగడమే జీవితం
సర్, మీరన్నది నిజమే ఏది వద్దనుకుంటమో అదే జరుగుతుంది. మీఎ స్పందనకు ధన్యవాదాలు.
Deletebaagundandi aasaavaha drukpadhamto ichchina ending..
ReplyDeleteవర్మ గారూ, ధన్యవాదాలు.
Deleteబతకాలనే బలమైన ఆశ ముందు అప్పుడప్పుడు ఏర్పడే వైరాగ్యం ఓడిపోక తప్పదు .
ReplyDeleteప్రతిమనిషికీ ఎదురయ్యే జీవిత పరమార్థమే ఇది .
జీవన సత్యాన్ని చక్కగా ఆవిష్కరించారు .
సర్, నిజమే ఆశ ముందు ఎదైనా ఓడిపోక తప్పదు, మీ విష్లేషణ బాగుంది. ధన్యవాదాలు మీ స్పందనకు.
Delete
ReplyDeleteఆహ్వానం లేని అతిదిలా ....కలవో,కల్పనవో .... అరుదెంచావు. బ్రతుకుపై తీపి ఎరుగను ..... బ్రతకాలనే కసి నాలో పెంచావు. ఇప్పుడు నీ చేతిలో చచ్చాకే తెలిసింది బ్రతుకంటే ఏమిటో.....
అగ్నిపూల లాంటి అక్షరాలు .... భావుకత్వానికి ఇంత బలముందా అనిపించే పదజాలం .... నిషిద్ధ గానం.
హృదయపూర్వక అభినందనలు మెరాజ్ గారు!
అగ్నిపూలవంటి నా అక్షరాలకు సువాసన ఇస్తాయి మీ ప్రశంసలు, ధన్యవాదాలు సర్,
ReplyDelete