Pages

Sunday, 1 September 2013

ఏమి చేయను






ఏమి చేయను


కంటి నిండా చూసుకుందామంటే

మబ్బుతునకవై సాగిపోయావు.


మనస్సు నిండా నింపుకుందామంటే,

వెన్నెల తునకవై జారిపోయావు.


పలకరించి పరవశిద్దామంటే,

పవనమై పారిపోతావు.


చిలిపిగా నిను చిత్రిద్దామంటే,

సైకత చిత్రమై చెదరిపోతావు.

12 comments:

  1. ఇంతకీ ఎవరబ్బా! :)

    ReplyDelete
    Replies
    1. కనుక్కోండి చూద్దాం..:-)

      Delete
  2. మనసుతో ముద్రించుకో ..నేస్తం! పంచభూతాలలో నువ్వు కలిసేదాకా నీలోనే ఉంటుంది ఆ ముద్ర.

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా మనోపలకం కంటే చక్కటి వేదిక ఇంకోటి ఉండదు కదా.. నచ్హిన నెచ్హలికి ధన్యవాదాలు.

      Delete
  3. కవిత బాగుంది .
    కాని కొంచెమే ఉంది .
    మరి కాస్త ఉంటే ?

    ReplyDelete
    Replies
    1. మరికొంచం రాద్దమంటే.... సశేషమై విశేషంగా నిలుస్తుంది. సర్ మెచ్హినందుకు ధన్యవాదాలు.

      Delete
  4. ఎప్పటిలా మీ కవిత చాలా బాగుంది. వనజగారి అభిప్రాయమే నాది కూడా ...

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  5. పంచభూతాల్లో ప్రేమకవిత బాగుంది

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ, ధన్యవాదాలు.

      Delete

  6. కదిలే మబ్బువు.
    వెన్నెల తునకవు.
    పారిపోయే పవనుడివి.
    సైకత చిత్రానివి.

    అంటూ మనో భావనలను సూక్ష్మంగా చెప్పిన తీరు బాగుంది.
    _/\_లు మెరాజ్!

    ReplyDelete
  7. ధన్యవాదాలు మీ స్పందనకు చంద్రశేఖర్ గారు.

    ReplyDelete