Pages

Saturday, 21 September 2013

నివేదన



నివేదన 


నా చిట్టి తండ్రీ. ....

అవిటితనపు అమ్మనురా,
ఎలా నీ భవితకి బాట వెయ్యగలను. .....
రెక్కలు తెగిన పక్షిలా. ..... నిస్సత్తువనై,
ఇసుమున ఇగిరిన తైలంలా . ...... నిష్ఫలమై,
శాపము బాసిన మోడులా ..... నిర్వీర్యమై,     
శరము తాకినా ఖగములా  . ..... నిస్సహాయనై,
కాంతి సోకని తిమిరంలా . ...... నిశాచరినై,
నెలవులేని కుటీరంలా . ..... నిరాదరినై.

నా చిన్ని ప్రాణమా . ..... 

నీ పాలబుగ్గల పసితనం వీడలేదే . ..... నీ అరచేతుల రేఖలింకా అమరలేదే.
నీ చిన్ని బొజ్జ నింపలేని నేను . ..... నీ చిట్టి గుప్పిట  బువ్వ ఎలా తినను.

ఒటుకూడా వెయ్యలేని అవిటినే . ..... చేయి చాపి అడగలేని అబలనే,
ఏ పధకాలు, ఏ ప్రయోజనాలు అందుకోలేనే,
ఎలా నీ భవితను తీర్చి దిద్దగలను.  
   
భయపడకు అమ్మనుకదా . ..... అనంతమైన విశ్వాసంతో . ..... జోడించిన నీ  చేతులతో దైవాన్ని ప్రార్థిస్తా.  
నీ భవితకు బాట వేస్తా.


1 comment:

  1. నా చిట్టి తండ్రీ. నీ భవితకు పూల బాట వెయ్యాలనుంది. అందరిలా ఊహలు, కలల జీవితాన్ని కోరుకోలేను కానీ నీకు రెక్కలొచ్చేవరకూ ఒడిలో నా హృదిలో దాచుకుంటాను.
    నా చిన్ని ప్రాణమా . .....
    నీ పాలబుగ్గల పసితనం వీడేవరకైనా నీ చిట్టి గుప్పిట బువ్వ తినాలని లేదు. అడిగెందుకు చెయ్యి లేకపోయినా అనంతమైన విశ్వాసం ఉంది ..... జోడించిన నీ పసి చేతులతో ఆ దైవాన్ని ప్రార్థిస్తానో లేదో కాని .... నీ భవితకు బాట వేసేందుకే చూస్తా.
    మనిషిలో ఆత్మ విశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంచె ఒక గొప్ప అనుభూతి ఈ కవిత నివేదన.
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete