Pages

Wednesday, 18 September 2013

నేటి అనాథలే..రేపటి అన్నార్తులు.




నేటి అనాథలే..రేపటి  అన్నార్తులు.


ప్రశ్నించే  ఆ చూపులకు ..
నువ్వు  జవాబు  చెప్పలేవు.

దిక్కదించే  ఆ చూపులను,
దైర్యంతో  నువ్వు   డీ కొనలేవు. 

నగ్నత్వ  బహిర్గత  నిజాన్ని,
నీ కళ్ళతో  నువ్వు  కాంచలేవు.

విసిరేసిన  ఆ  కర్ణుల  గాధను,
నీ కర్ణంతో  నువ్వు వినలేవు.

వారిపై పడిన చీకటి  మరకలను,
ఏ వెలుగు వస్త్రం తోనూ  తుడవలేవు.

నువ్వెంత తల తిప్పుకున్నా,తల దించుకున్నా,
తల విదుల్చుకున్నా, తల ఊపుతున్నా...

నిత్యం  నీ ముందు నుండి  వెళుతూ..
నీ  కంటబడే  తలలు లేని  మొలలు వీళ్ళు.

భారతమ్మ భారంగా మోసే.. బాల్యం లేని,
భావి పౌరులు  వీళ్ళు.

భారతమ్మ  పురిటి  నొప్పుల  తరాజులో 
చీకటి   తప్పుల  తూకం రాళ్ళు  వీళ్ళు. 

14 comments:

  1. ఈ సమాజాన్ని అడిగి చూడు .... ప్రశ్నించి దిక్కరించే ఆ చూపులకు ఎవరివద్దా జవాబు, డీకొనేందుకు ధైర్యమూ లేదని తెలుస్తుంది. ఆ జీవితాల వెనుక వున్న నిజం చూడలేరు. ఆ గాధల్ని వినలేరు. నిత్యం కళ్ళ ముందు కదిలే మొలల్ని, బాల్యం కోల్పోయిన భావి పౌరుల్ని, అందరిలానే తొమ్మిదోనెల పురిటి నొప్పుల తరాజులో తూకం రాళ్ళలాంటి ఆ జీవితాల్ని.

    ఎన్నో జీవిత కాలాల అనుభవం అనుబంధం అణగారి విసిరేయబడ్డ జీవితాలకూ మీ ఆలోచనలకూ మధ్య చూస్తున్నాను ఫాతిమా గారు! అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
    _/\_లు అభ్యుదయ కవయిత్రీ!

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారూ, ఆలోచనలు ఆచరణలోకి తేవాలనే నా ప్రయతం.(కొంత నెరవేరింది కూడా) మీ అందరి అభిమానం నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.

      Delete
  2. మీ తరువాతేనండి...ఎవరైనా పేదవారి ఆకలి కేకల్ని వినగేలివారు .

    ReplyDelete
    Replies
    1. ఈ అభిమానమే నాకు స్పూర్తిదాయకం పద్మాడియర్.

      Delete
  3. భారతమ్మ పురిటి నొప్పుల తరాజులో
    చీకటి తప్పుల తూకం రాళ్ళు వీళ్ళు.
    చాలా చక్కటి పదప్రయోగం సుమా !

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ, పదప్రయోగం నచ్హినందుకు ధన్యవాదాలు.

      Delete
  4. నేటి సమాజంలో బాధ్యతలు పట్టించుకోని యువత వల్ల కలిగే ప్రమాదమే ఇది.

    ReplyDelete
    Replies
    1. నిజమే సర్, బాధ్యత ఎరుగని వారిప్రవర్తన తరువాతి తరం మీద పడుతుంది.

      Delete
  5. బాలలు అనాధలు !
    కోకొల్లలు, బాధలు !
    మీ కవితలు,
    అక్షర చిత్రాలు !
    కాకూడదు అవి ,
    నిశ్చల వీక్షణం !
    వారికి నిత్య జీవితం,
    ఓ మహా భారతం !
    ప్రశ్నలు అనేకం,
    సమాధానం ఒకటే !
    స్పందించి చేయాలి,
    సహాయం, తక్షణం !
    చిగురింప చేయాలి,
    కనీసం, ఒక్క క్షణం !




    ReplyDelete
    Replies
    1. సుధాకర్ గారు, స్పందంకు నా నమస్సులు, నా వంతు కృషి ఉంటూనే ఉంది.

      Delete
  6. ఫాతిమా గారు-
    what a nice writing అండి.అభాగ్య బాలల గురించి మీరు వ్రాసిన ప్రతిఒక్క వాక్యము అక్షర సత్యం అండి.
    నా ప్రయతం.(కొంత నెరవేరింది కూడా) మీ ప్రయత్నంలో మేమేమైనా ఉపయోగాపదగాలమా?

    మీ రచనలు -ఎటువైపు రావాలి, అని అనుకుంటున్నానో అటువైపే వచ్చాయి.చాలా సంతోషంగా ఉంది.
    మీయొక్క కలం పవర్ని ఇలాంటి సామాజిక అంశాలపై ఎప్పటికి ఉపయోగిస్తారని ఆశిస్తూ-హరి పొదిలి

    ReplyDelete
    Replies
    1. హరి గారూ, " మనమేమిచేయలేమా" ఇదీ మన ఆలోచనల పరంపర ఎందుకు చేయలేమూ చేయగలము,
      నేనూ నా చిన్ని చేతులతో ఆకలిరాక్షసిని అదిలించాలని చూస్తున్నాను.
      ఎప్పటిలా మీ ఆదరాభిమానాలను నా కవితలపై కురిపించాలని కోరుకుంటున్నాను.

      Delete
  7. కవిత చాలా చాలా బాగుందండి.

    భారతమ్మ పురిటి నొప్పుల తరాజులో
    చీకటి తప్పుల తూకం రాళ్ళు వీళ్ళు.

    ఈ వాక్యంలో వైవిధ్యము బరువు సమతుల్యం చెందిన వాక్యముగా అనిపించినది ... wonderful claps for your vision..

    ReplyDelete
    Replies
    1. సాగర్ గారూ, మీ ప్రశంసకు నా కవిత అర్హత పొందింది సంతోషం. ధన్యవాదాలు మీకు.

      Delete