చీకటి మార్పిడి
చీకటి సామ్రాజ్యానికి,
ఆకటి స్నేహానికీ,
అతి దగ్గరిదా బొమ్మ.
శరీరమే ఇక్కడ పెట్టుబడి,
ఆడతనమే పలుకుబడి,
దానిపైనే రాబడి.
తనువే తగలబడి,
తరాల తరబడి అమ్మకానికే,
అలవాటుపడి.
వాడిన మల్లెల సవ్వడి,
గాజుల గల,గల అలజడి,
నలిగింది, ఆడ మాంసం సిగ్గుపడి.
నిప్పుల పాన్పుపై,
ఆకటి దేహపు ఒరిపిడి,
సుఖం నవ్వింది సిగ్గుపడి.
నగ్న శరీరపు కామం,
కాటేస్తుంది తెగబడి,
ఆగిపోతుందీ నాటకం తెరపడి.
ప్రతి సారీ సాగుతుందీ,
ఆత్మవంచనా దోపిడీ,
ఆడతనం ఉన్నంత వరకే.....ఈ పస్తు మార్పిడి.
***
అందుకే తెరతీయి
ఆత్మ స్థైర్యానికి త్వరపడి.
తట్టుకో ఆటుపోటుల జీవితపు ఒరవడి.
నిన్ను నువ్వు దిద్దుకో
ఎప్పుడూ వెళ్ళకు "తప్పుబడి"
నువ్వుతెచ్చే తరమే జగతికి "పసిడి".
ReplyDeleteఆకటి స్నేహం, శరీరమే పెట్టుబడి, తనువే తగలబడి వాడిన మల్లెల సవ్వడి, నలిగిన ఆడ మాంసం సిగ్గుపడి. నిప్పుల పాన్పుపై, నగ్న శరీరపు కామం, .... ఎప్పుడూ సాగే తంతే ఇది, ఆత్మవంచన, దోపిడీ, ఆడతనం ఉన్నంత వరకే ....
"చీకటి సామ్రాజ్యంలో. ...." కవిత చదువుతున్నంత సేపూ నాకు ఆ రావిశాస్త్రి(గొప్ప రచయిత) గారే గుర్తుకొచ్చారు. చాలా చాలా బాగా రాసావు కవిత అంటే తక్కువవుతుంది. అభినందనలు ఫాతిమా గారు!
చంద్ర గారూ, రావిశాస్త్రి గారు నా అభిమాన రచయిత,
Deleteఆయనతో పోల్చి నా జన్మ ధన్యం చేశారు.
నా అభిప్రాయాన్ని నా కవితల్లో చూసి నన్ను ముందుకు నడిపించే మీకు నా ధన్యవాదాలు.
మరో మాట లేదు దాగి ఉన్న భావానికి
ReplyDeleteమరో పదం లేదు అందమైన ఈ హారానికి
మీలో చాల ప్రత్యేకమైన విషయము ఏమిటంటే సరళత్వము.....
సరళమైన పదాలతో లోతైన భావాన్ని తీయడం చాల కష్టమని నా అభిప్రాయము ..... మీరు అది చాల సులువుగా చేసేస్తారు ..... మీలోని రచనా స్పూర్తికి అభినందనలు....
నేను అలా చేసిన ప్రయత్నమే నా ఈ మౌనమేలనోయి....
కవితను అర్ధం చేసుకోవటానికి మీకున్న భావుకతే కారణం,
ReplyDeleteమీ కవితలో నిగూడంగా దాగిన నిస్టూరం నన్ను చాలా అబ్బుర పరుస్తుంది.
మీ కవితలు చాలా వరకు సున్నితమైన స్త్రీ నిందతో ఉంటాయి,
ప్రేమను గుర్తించని స్త్రీపై ఓ విదమైన నిష్టూరాన్ని సందిస్తారు,
ఇకపోతే సాటి కవులను ప్రశంసించే మీ స్పందన చాలా గొప్పది.
సాగర్ గారూ, నా భావాలను సూటిగా శరాలల సందించటమే నేను చేయాలి అనుకొనేది,
భాష ఎలా ఉన్నా పరవాలేదు నా కవితపై కొంచమైనా ఆలోచించగలగాలి.
ఆర్ద్రత , ఆవేశాలతో రాశారు కవిత, ఫాతీమా ! అభినందనలు !
ReplyDeleteకడుపు మాడుతూంటే ,
కడుపు పోయినా,
పడుపు గానే బతుకులీడ్చే ,
పడతులున్నారు !
వారు, మగాడి గడి లో,
చిక్కిన పావులు !
ఆటుపోటుల జీవిత ఒరవడి లో,
వేటు పడుతున్న గోవులు !
పొర పాటు విటుడి దైనా,
' నేరం ' మోస్తున్న జీవులు !
మీరన్నది అక్షరాలా నిజం, కానీ స్త్రీ కి ఆత్మస్థైర్యం కావాలి,
ReplyDeleteనేను బ్రతకగలనూ అనే మరోదైర్యం లేక తనను బలిపీటంపై పెట్టుకుంటుంది,
దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు అయితే మార్గాలు వెతుక్కోవటమే ఆమె చేస్తున్న పొరపాటు,
తప్పు ఇద్దరూ చేస్తున్నా తనను మాత్రమే నిందితురాలిగా తనే ఒప్పుకుంటుంది.
అతి దారునమైన నిర్భాగ్య పర్స్థితికి తనను తానే గురిచేసుకుంటుంది.
ఇకపోతే నాగరిక ముసుగులో, అదునాతన ఆలోచనలో కొందరు స్త్రీలు ఇలాంటి తప్పునే వ్యాపరంగా చేస్తున్నారు. క
బేళా లేకుండానే బలి పశువులు అవుతున్నారు,
దానివల్లా కొంత సమాజానికి కీడుకొనితెచ్చినవారవుతున్నారు,
సుధాకర్ గారూ, స్పందన హర్షదాయకం
వ్యాఖ్యకి మాటలే కరువయ్యాయి."మారదులోకం, మారదుకాలం" అన్నాడు మా మిత్రుడు సిరి వెన్నెల.
ReplyDeleteమాస్టారూ..,మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteమగువ కు తెగువ ఎప్పటికి అవసరం
ReplyDeleteతనదంటు ఏది తానెప్పుడు అనని నిఃస్వార్థం
కల్మశాలే ఎరుగని తల్లి తానె అల్లరి చేసే చిన్నారి చెల్లి తానె
మనసు ఎరిగె మనస్వి తానె చిలిపి కబుర్లు ఆడే చిన్నారి తానె
నా కవితలకంటే వ్యాఖ్యలు బావుంటాయ్ అన్నారు. ఏదేమైనా పరవాలేదులెండి. నేనేమి అన్ని ఎరిగిన కవినైతే కాను. ఏదో అలా రాయాలని రాస్తున్న. ఏదేమైనా మీ కవితలు ఆలోచింపచేస్తాయి.
నా స్పందనను మరోమారు చదవండి అందులో మీకు విమర్శ కనిపిస్తుందో, ప్రశంస కనిపిస్తుందో. ఇకపోతే ఇతరుల రచనలను మెచ్చుకొవటం అందరికీ రాదు అది మీకున్న గొప్పతనం. అస్సలు మీ బ్లాగ్ నాకు కనిపించదు ఎందుకో, హారం నుండి చూశాను. ఏదిఏమైనా నొప్పించాలనే ఉద్దేస్వం నాకు లేదు.
Deleteఅంగడిబొమ్మల ఆవేదననికి అద్దం పట్టారు.
ReplyDeleteపద్మగారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteచిక్కని భావాత్మక కవిత.
ReplyDeleteసృజనా, ధన్యవాదాలు మీ స్పందనకు
ReplyDelete