క్షతగాత్రినై...
మది గదిలో స్వయంకృత బందీనై....
నిశ్చల ధ్యానములో చెదరిన స్వప్నాన్నై...
చేయని నేరానికి తలవంచిన అపరాదినై...
నిదురలేని రాత్రిలో విరిగిన కలల విరాగినై...
అక్షర అగాధాల మద్య విరామ చిహ్నాన్నై...
ఉన్మత్త ఉచ్ఛులో చిక్కిన కపోతాన్నై...
సుదీర్ఘ అశాంతి రాత్రుల ఆటల పావునై...
కసాయినే సత్కరించిన నిష్కల్మషినై...
ప్రేమలు లేని ప్రపంచాన అనిశ్చల మనస్కినై...
నమ్మక ద్రోహానికి తలవంచిన సన్నిహితనై...
ఆశల ఉదయానికై ఎదురుచూసే అంధుని కంటిపాపనై...
వీడిన మన:శాంతికై వేచిఉన్న నిరంతాన్వేషినై....
ఉప్పెన ముప్పులో నిరంతరం ఎదురీదుతూ..,
వెతల కడలిలో లంగరుకై ఎదురుచూస్తూ..
ఉప్పెన ముప్పులో నిరంతరం ఎదురీదుతూ..,
వెతల కడలిలో లంగరుకై ఎదురుచూస్తూ..
ReplyDeleteమది గదిలో స్వయంకృత బందీనై.....
Great feel!
అనూ, ధన్యవాదాలు.
Deleteనేనొక చెదరిన స్వప్నాన్ని, విరిగిన కలల వైరాగ్యాన్ని
ReplyDeleteఅక్షర పదాల మద్య విరామ చిహ్నాన్ని, ఉన్మత్తత ఉచ్ఛులో చిక్కుకుపోయిన కపోతాన్ని
ఉప్పెన ముప్పుకు నిరంతరం ఎదురీదుతూ, వెతల కడలిలో లంగరుకై ఎదురుచూస్తూ .... నేనొక క్షతగాత్రిని
ప్రతి అక్షరం ప్రతి పదం సున్నితం గా విడమర్చుతున్న భావరాగం సూటిగా గుండెల్ని తాకుతూ ప్రశ్నిస్తున్నట్లుంది .... మనసు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగల శక్తి ఎంతమందికి వుందీ అని
అభినందనలు ఫాతిమా గారు.
చంద్రగారూ, నా మనస్సులోని ఎన్నో సందేహాలకు సమాదానం వెతకటమే ఈ కవిత. నన్ను నేను ప్రశ్నించు కోవటమే ఈ అక్షర వేదన. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteఈ మొత్తం లైనులు దేనికి దానికే పద పొందిక చక్కగా వున్నది .
ReplyDelete" మది గదిలో స్వయంకృత బందీనై....
నిశ్చల ధ్యానములో చెదరిన స్వప్నాన్నై...
చేయని నేరానికి తలవంచిన అపరాదినై...
అక్షర అగాధాల మద్య విరామ చిహ్నాన్నై...
ఉన్మత్త ఉచ్ఛులో చిక్కిన కపోతాన్నై...
సుదీర్ఘ అశాంతి రాత్రుల ఆటల పావునై...
ప్రేమలు లేని ప్రపంచాన అనిశ్చల మనస్కినై...
నమ్మక ద్రోహానికి తలవంచిన సన్నిహితనై...
ఆశల ఉదయానికై ఎదురుచూసే అంధుని కంటిపాపనై...
వీడిన మన:శాంతికై వేచిఉన్న నిరంతాన్వేషినై....
ఉప్పెన ముప్పులో నిరంతరం ఎదురీదుతూ..,
వెతల కడలిలో లంగరుకై ఎదురుచూస్తూ.. వున్న క్షతగాత్రినై . "
ఈ ఒక్కటే కొంచెం ఆలోచించేటట్లు చేస్తోంది .
" కసాయినే సత్కరించిన నిష్కల్మషినై... "
శర్మ గారూ, మీరు ఉటంకించిన ఆకరి వాఖ్యమే నేను చెప్పాలి అనుకొన్నది,గాయపడ్డ ప్రతి స్త్రీ హ్రుదయం ఆలోచించాల్సింది కసాయిని తానెందుకు ( మన్నిస్తుందీ, క్షమిస్తుందీ) సత్కరిస్తుంది. చదివిన మీకు ధన్యవాదాలు.
Deleteక్షతగాత్రి హృదయాన్ని వేదనగా ఆవిష్కరించిన పద పొందిక అద్భుతంగా వుందండీ.. అభినందనలు ఫాతిమాజీ..
ReplyDeleteవర్మ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
Deleteశ్రీ శ్రీ కవిత ఒకటి గుర్తుకొచ్చింది.
ReplyDelete' నా గది లోపల చీకటిలో చీకటిలోపల నా గదిలో '
అంటూ..
మీరు మదిని గది గా ఉపమాలంకారం చేసారు.
బాగుంది. మది లోని వ్యథని
వ్యక్తీకరించని తీరు.
మరో చిన్న విషయం:
https://www.facebook.com/gangasreenivas.gorli
ఇది రేడియో థరంగ అనే ఇంటర్‌నెట్ రేడియోలో కస్తూరి మురళీ కృష్ణ నిర్వహించే సృజనస్వరం అనే ప్రోగ్రాం లో 14 న ప్రసారమైన నా స్వరం. విని మీ కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను.
telugu.tharangamedia.com/wp-content/uploads/2013/09/20130914-Srujana-Swram-Sree-Ganga.mp3
సర్, నా మది కూడా శ్రీ.శ్రీ. గారి మది గది లాంటిదే,:-)
Deleteమెచ్హుకున్న మీకు నా ధన్యవాదాలు.
ఇకపొతే మీ స్వరం లో, మీ కథల వివరణ విన్నాను.నాకున్న చాలా సందేహాలు తొలగిపోయాయి..
నేను కూడా మీరు రాసిన శేతురహస్యం గూర్చి చాలా అడగాలి అనుకున్నాను.
ఇలాంటివి ఇంకా ఎన్నో మీ నుండి ఆసిస్తూ..
మీ కవిత, చిత్రం తో పోటీ పడింది ఫాతిమా !
ReplyDeleteమీరు మంచి కవయిత్రులే సుమా !
సుధాకర్ గారూ, చాలా సంతోషంగా ఉంది,
Deleteచూశారా నేను కవయత్రిని అని ఒప్పుకున్నారు. మీ వంటివారి మెప్పుపొందటం ఆనందం కదా, ధన్యవాదాలండీ.
భలే వారండీ ! నేను 'ఫాతిమా'లాంటి వారి దగ్గర,
ReplyDeleteకవితల 'ఓనమాలు' నేర్చుకునే వాడినేనండీ !
సుధాకర్ గారూ, ధన్యవాదాలు
Deleteఇంత వేదనని .. కడలి దాచుకోవాల్సిందే! లంగరు పడటం చాలా కష్టం సుమా.. !
ReplyDeleteసహజత్వంని స్త్రీ మాత్రమే ప్రదర్శించగలదు . ఈ కవిత అదే చెప్పింది . మంచి కవిత మేరాజ్.. అభినందనలు
వనజా, స్త్రీ హ్రుదయమూ, సముద్రమూ రెండూ లోతైనవే, లోపల బడబాగ్ని రగులుతున్నా బైటకి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. నా కవితని మీ విష్లేషణ లో చూడటం నాకిష్టం.
Delete