కాడు (పాడు) జీవితం
ఊపిరి ఆగి విశ్రమించే చోట,
జీవి ఊపిరి పోసుకుంటూ.
వైరాగ్యం వేణుగానమైన చోట,
వినిపిస్తుంది ఓ జోలపాట.
గుండె దడ, దడ మనే చోట,
బుడ,బుడ అడుగుల బాట.
నిశిరాతిరి శవాల కమురు కంపు,
హోరుమనే దప్పుల జోరే ఇంపు .
శవం వెనుక చిట్టి అడుగుల ఉరుకులాట,
విసిరిన చిల్లర డబ్బులకై కుమ్ములాట.
ఎవరు చచ్చినా వాళ్లకు పరమానందం ,
ఎవరు పెట్ట్టినా పిండమే పరమాన్నం.
బొందలగడ్డలో ఇప్పుడు రాబందులు లేవట,
అక్కడున్నదంతా కబ్జా గద్దలేనంట.
పట్నం పెరిగి పెద్దది అవుతుందంట,
గోప్పోడి గోరీ ఊరిమద్యేనంట.
సమాదులపై సంసారాలు రద్దయినాయంట.
అపార్టుమెంటుల పునాదులు లేసాయంట.
ఓరి గరీబొడో ఎక్కడికి పొతావురో...
సచ్చినోడికే చోటులేకుంటే...
నీ సంసారమెక్కడ సాగిస్తావురో.
గోరీనొదిలి ఎక్కడికి పోతావురో...
నిను తరిమినోడి గోరీ ఎప్పుడు కడతావురో..
బొందలగడ్డలో ఇప్పుడు రాబందులు లేవట,
ReplyDeleteఅక్కడున్నదంతా కబ్జా గద్దలేనంట -
నిజమే , స్మశానాలూ కబ్జా అవుతున్నాయి మరి .
ధన్యవాదాలు మీ స్పందనకు
ReplyDeleteమీరు చెప్పింది నిజమే ... ఇప్పటి వాస్తవం ఇదే.
ReplyDelete