Pages

Wednesday, 22 January 2014

కాలుతున్న పూలతీగలు

   









    కాలుతున్న పూలతీగలు. 

     పూలతోటలో పరిమళించాల్సిన  కుసుమాలు ,
     దున్నపోతుల  గిట్టలకింద నలుగుతున్నాయి. 

     వెలుగు కిరణాలతో  విరియాల్సిన  గులాబీలు,
     నిశి  రాతిరిలో నుసి రేఖలై  రాలుతున్నాయి. 

     అక్షరాల  ఆలయాలలో కూడా రాక్షస పాదాలు. 
     సంచరిస్తూ  సరదా  తీర్చుకున్తున్నాయి. 

     ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఊరిబైట చేరి ఊరిస్తున్నాయి,
     మిడతల దండును తరిమేందుకు  మిరియపు పొడినిస్తున్నాయి. 

     గడప దాటిన తనయ  ఘడియైనా  కాకముందే,
     వార్తల్లో నాని  నాన్నకి  శవమై  అగుపిస్తుంది. 

     ఎన్ని డేగల ముక్కులు పొడిచాయో..,ఎన్ని కుక్కలు ఎంగిలి చేశాయో 
     ఎన్ని ఎలుగులు దాడిచేశాయో,క్షణ,క్షణమూ  వీక్షణం. 

     కన్నవాళ్ళ,తోడబుట్టిన వాళ్ళను  కెలికి,కెలికి,
     నిజాలు తెలుసు కొంటున్న  వైనాలు. 

     దాడిచేసిన  అడవి దున్నలు,జనారణ్యం లో 
     రోమ్మువిరుచుకు  తిరుగుతున్నాయి.

     ఏలికలు  బృహన్నలై  "అభయ" ముద్రలు చూపుతున్నారు,
     న్యాయ స్థానాలు  "నిర్భయ" వాగ్దానాలు చేస్తున్నాయి.  

     ఆడబిడ్డలని  వివస్త్రలను  చేసిన  ఉన్మాదులకు,
     ఇలాంటివి "అనూహ్య " సంఘటనలవుతున్నాయి. 

     ఒక్కసారి,

     మదాన్ధులను  వధించి చూడు, 
     ఉన్మాదులను ఉరేసి చూడు,
     చట్టం దాని పని అది చేసుకొనేలా చూడు,
     తక్కెట్లో  న్యాయాన్ని సరిచేసి చూడు.   




35 comments:

  1. కాలుతున్న మల్లెతీగలు ఇక భగభగ మండే ఇనుప తీగెలై తిరగబడితే తప్ప ఏ న్యాయవ్యవస్థ కుడా ఈ అవస్థనాపదు. పాపం న్యాయదేవత కూడా ఆడదైనందుకేమో మదాంధుల
    ధనాంధుల, మగాంధుల చేతుల్లో తక్కెడను తల తాకట్టు పెట్టుకుంది.
    నారి ఇక తన వింటి నారి సంధించాల్సిందే దీదీ..

    ReplyDelete
    Replies
    1. నిజమే..ఎవరో వచ్చి రక్షిస్తారు అనుకోవటం కంటే ఆడపిల్ల తనని తానే రక్షించుకోవాలి, వింటి నారి సవరించుకోవాలి.
      భాయ్ మీ స్పందనకు థాంక్స్.

      Delete
  2. "అక్షరాల ఆలయాలలో కూడా రాక్షస పాదాలు.
    సంచరిస్తూ .... ఎన్ని డేగల ముక్కులు పొడిచాయో ...., ఎన్ని కుక్కలు ఎంగిలి చేశాయో
    ఎన్ని ఎలుగులు దాడిచేశాయో
    దాడిచేసిన అడవి దున్నలు,జనారణ్యం లో
    రోమ్మువిరుచుకు తిరుగుతు ...."

    "కాలుతున్న పూలతీగలు" కవిత లో సమాధానాలు వెదుక్కోవాల్సిన ఎన్నో అక్రమ, అవినీతి, అకృత్య లక్షణాలు .... మనిషిగా బ్రతకడానికి ప్రతిక్షణమూ అప్రమత్తంగా ఉండాల్సిన అగత్యాన్ని గుర్తు చేస్తూ ....
    అక్షరాయుధాలతో నిద్రలేపుతున్నట్లుంది. అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. సర్, ఏమీ చేయలేని నిరాసక్తత,బాద, కనీసం అక్షరాలతో నైనా సేదతీరటమే..
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  3. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదనలు ఆరని జ్వాలలవుతున్నా , ఆడపిల్లల ఆర్తనాదాలు మిన్నంటుతున్నా, తోడబుట్టినవారి గుండెలు పగిలిపోతున్నా , సహవిద్యార్ధులు/ఉద్యోగులు వారికై ప్రభుత్వాన్ని అభ్యర్ధించినా , కేసులు పెట్టినా అవన్నీ కాసుల ముందు బలాదూరే మీరజ్ ....ఇవిలా రావణ కాష్టంలా కాలుతూనే ఉంటాయనుకుంటా ...ఎందుకంటే బాధ్యత కలిగిన నాయకులు ...స్త్రీలను గౌరవించే నాయకులు ....కంటిచూపుమేర కానరావడంలేదు..ఉంటేగా కానరావడానికి....కారణమైన ఒక్కడిని నిలబెట్టి నిలువునా నలుగురిలో నడిరోడ్డు మీద ఉరివేస్తే మరొకడు ఎందుకు చేస్తాడు ?ఏదేమైనా ఆడపిల్లల తల్లిదండ్రులారా మన ఆడపిల్లలు పచ్చగా పదికాలాల పాటు జీవించేలా సమాజంలోని కలుపు మొక్కల్ని , చీడ పురుగుల్ని నాశనం చేసే శక్తినిమ్మని ప్రతిదేవుణ్ణి,రాయిని ,రప్పని ప్రార్ధించుదాం .

    ReplyDelete
    Replies
    1. దేవీ,కొంత కాలానికి స్త్రీలు ఉండరు. ఇప్పటికే ఆడబిడ్డలని కాపాడుకోలేక తల్ల్లిదండ్రులు వద్దురా బాబూ కూతుళ్ళు అనుకుంటున్నారు.
      ఇతర దేశాలలో సిక్షలు ఎలా అమల్లో ఉన్నాయో తెలుసుగా... మనదేశములో మానవ హక్కులు అడ్డొస్తాయి.
      నాదో సందేశం ఆ వెదవలు మానవులెలా అవుతారు ? వారికి మానవత్వం ఉంటే అలాంటి కిరాతకాలు చేస్తారా?
      ఆ సమయం లో ఆ చిట్టితల్ల్లుల నిస్సహాయత ఎంత దయనీయమో కదా, ఆ బంగారు తల్లులని తలుచుకొంటే గుండె తరుక్కుపోతుందే...ఎందుకు ఈ ప్రభుత్వానికి పట్టదు. ఎప్పటికి మారేను,

      Delete
  4. Replies
    1. చాలా బాద కలుగుతుందండీ...అనూహ్య గూర్చి విన్న తర్వాత మనస్సు కలత పడింది.ఆ తల్లిదండ్రుల వేదన ఎలాంటిదో కదా...

      Delete
    2. చాలా్ వేదన అనిపించిందండీ.. అనూహ్య సంఘటన మనస్సును కలచివేసింది.

      Delete
  5. Chaalaa baagundi fatima gaaru

    ReplyDelete
    Replies
    1. ఏమి బాగో.. ఏమీ చేయలేని అసమర్దతని ఇలా అక్షరాల చాటున దాచుకోవటం తప్పా...

      Delete
    2. ఏమి బాగో, ఏమీ చేయలేని అస్మర్దతను ఇలా అక్షరాల చాటు దాచుకోవటమే..

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
  6. మీరు రాసిన ఈ ఆవేదనకు ప్రత్యుత్తరం ఏమని పెట్టమంటారు...? యుగాంత సంకేతానికి ఇది సజీవ సాక్ష్యమని చెప్పనా...? ఆడపిల్లలను కాటేస్తున్న మగాళ్ల జాతిలో పుట్టి సిగ్గుతో తలదించుకోనా? కొంతమంది తల్లిదండ్రులు కాలక్షేపానికి మగ పిల్లల్ని కనేసి.. కనీస సంస్కారాలు నేర్పకుండా అచ్చోసి ఊరకుక్కల్లా ఊరిమీదకు వదిలేస్తున్నారని నిందించనా? భవిష్యత్తు నిర్మించే స్థాయిలో, సమాజ హితాన్ని కోరే పౌరులను తయారు చేయలేకపోతున్న నేటి విద్యావ్యవస్థ నంపుశకత్వాన్ని ఎండగట్టనా?
    నడిరోడ్డు మీద వివస్త్రను చేసి ఆడపిల్లలను విసిరేస్తున్న కసాయిలు కళ్లముందు కనిపిస్తున్నా.. కఠిన శిక్షలు వేయలని మన చట్టం అసమర్థతను తిట్టుకోనా? ఇంత జరుగుతున్న ఓట్ల రాజకీయాల మత్తులో మునిగితేల్తున్న మనం ఎన్నుకున్న నేతల స్వర్ధాన్ని నిలదీయనా? భారత దేశంలో ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని ఆనందించాలో.... దీన్ని భవిష్యత్తులో
    పిశాచాల నుంచి ఎలా కాపాడాలి అని బాధపడాలో అర్థం కాని స్థితి ప్రస్తుత పరిస్థితి. క్షమించండి... చాలా సుదీర్ఘమైన కామెంట్
    పెట్టాను. ఆవేదన ఆపుకోలేక.

    ReplyDelete
    Replies
    1. శిక్షలు లేవు, ఇలాంటి దౌర్భాగ్యపు దేశములో పుట్టటం ఆ బిడ్డల దురదృష్టం,
      చీకటిలో... ఆ పిశాచాలకు బలైనప్పుడు బయంతో ఎంతగా తల్లడిల్లారో...
      ఒక్క్కడినైనా శిక్షించారా? లేదు కదా, మరి ఎవడికి బయం ఉంటుంది.
      ఇలాంటి అరాచకాలు చేసే వెదవలంతా చరిత్ర హీనులే,

      Delete
    2. dhanyavaadaalu mee spandanaku sateesh gaaru

      Delete
  7. దేశం చాలా క్లిష్ట పరిస్తితిలో ఉంది మాష్టారూ.... పురుష సమాజం మారాలి. చట్టం, శిక్షా స్మ్రుతి మార్చాలి..
    కవిత బాగుంది అక్కా!!!!

    ReplyDelete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. మీకు తెలుసో లేదో ....మీ కవిత గురించి.
    అసాధారణం.
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.....
    అగ్నిశిఖ.
    ఏ వాక్యాన్ని ఎన్ని చెప్పను? సాటిలేని పదును బాకని, గుండె పగిల్చే సమ్మెటని .
    రైం అండ్ రిధం కోసం వాడిన "మిరియాల పొడి, అనూహ్య " సందర్భాలు ప్రయోగాలు మరింత మెరుగ్గా చేస్తారా?

    ReplyDelete
  14. సందీప్ గారూ, నా కవిత నచ్చినందుకు ఓ విదంగా సంతొషమే...
    కానీ, జరుగుతున్న సామాజిక పరిణామాలకు పరిష్కారాలు కనిపించటం లేదు,
    ధన్యవాదాలు మీ స్పందనకు, తప్పకుండా ఇంకా బాగ రాసేందుకు (నా కర్తవ్యంగా) ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  15. పెప్పర్ స్ప్రే ఇచ్చి బాలికలను తమను తామే రక్షించుకోమంటున్నాయి ఉద్యోగాలిచ్చిన సంస్థలు,
    ఇక అనూహ్య సంఘటనలు హటాత్తుగా ఆనందాన్ని పంచేవిగా దుర్మార్గులకు దొరుకుతున్నాయి,

    ReplyDelete
  16. ధర్మాగ్రహమే కాని జాగ్రత్తలు లేకపోతే బతుకు చిందరవందరే!

    ReplyDelete
    Replies
    1. నిజమే సర్, జాగ్రత్త అవస్రమే...కానీ అడుగడుగునా ప్రమాదమైతే....మనుగడ అసాద్యం .

      Delete
  17. "గడప దాటిన తనయ ఘడియైనా కాకముందే,
    వార్తల్లో నాని నాన్నకి శవమై అగుపిస్తుంది. "

    ఎన్ని సంఘటనలు ఇలా . అంతమేది దీనికి . సాంతం చదివాకా కళ్ళు చెమ్మగిల్లాయి . జరుగుతున్న దారుణాలని అరికట్టాలంటే ?
    అవును... తప్పదు ....

    "మదాన్ధులను వధించి చూడు,
    ఉన్మాదులను ఉరేసి చూడు,
    చట్టం దాని పని అది చేసుకొనేలా చూడు,
    తక్కెట్లో న్యాయాన్ని సరిచేసి చూడు. "

    ఇలా జరగాల్సిందే - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ సహకారానికి.

      Delete