మేరీ ప్యారీ....మా.
ఆశ నిరాశల సుఖదు:ఖాల ఆటవిడుపుల్లో
మరణిస్తూ,జీవిస్తూ..,
సతమవుతుంది భారతమ్మ.
కొత్త చిగురుల ఆవిష్కరణలో,
పాత తెగులును పోగొట్టుకోవాలని
చూస్తుందీ కొమ్మ.
నెత్తురోడుతున్న రహదారుల్లో ,
పచ్చటి పాదాలను మోపలేక ,
కుంటినడక నడుస్తుందీ అమ్మ .
పల్లె నుండి పట్టణాల దాకా
నాగరికత బట్టలూడదీసుకొని బలాదూర్గా,
తిరుగుతుంటే గాంధారిలా..,
కళ్ళకు గంతలు కట్టుకొని గడిపేస్తుంది
రక్కసి రాబందులు
లేత గువ్వలను ముక్కున కరచుకొని,
పొడిచి,పొడిచి ఈకలు పీకి వీధిలోకి విసిరేస్తుంటే,
జెండా కప్పి సంతాపం తెలియజేస్తుంది.
అంతము కాని మతం మంటల్లో,
కుళ్ళిపోతున్న కులం కంపులో,
ముక్కు మూసుకొని మునుగుతుంది.
ఓటు పడవలో పయనిస్తూ ,
ఎప్పుడు మునుగుతారో తెలీని తన బిడ్డలకు,
మువ్వన్నెల తెరచాపను అడ్డుపెడుతుంది.
దిగాలు పడే అమ్మకు ,
దైర్యం చెప్దాం,
గండుచీమలు కొండను మింగలేవనీ..,
ఏనుగు ను కుక్కలెప్పుడో గెలవలేవనీ..,
అమ్మపాల రుణాన్ని అసురులడ్డుకోలేరనీ....,
నా కమెంట్లతో బ్లాగర్ల మిత్రులకు యిబ్బందికరంగా వుంటే ఆపేయాలనుకుంటున్నాను .
ReplyDeleteఓ రచనకు వ్యాఖ్య వ్రాస్తున్నానంటే పని లేక అనుకోకండి . ఆ రచనలో అవసరమైన మార్పులు చేస్తే ఆ రచన యింకా ఎంతో బాగుంటుందని , ఆ రచించిన వాళ్ళకు మంచి పేరు రావాలన్న సదుద్దేశంతోనే వ్రాస్తుంటాను . దానిని అర్ధం చేసుకొంటే కొనసాగుతాయి నా వ్యాఖ్యలు . లేకుంటే నా వ్యాఖ్యలు ఆగిపోతాయి . వ్యాఖ్యలు ఆగినా నేను అందరి బ్లాగర్ల రచనలు చదువుతూనే వుంటాను .
భావం బాగున్నది .
మీరు ఇబ్బందిపెడుతున్నారని నేను అనలేదు.
ReplyDeleteనాకు సాద్యమైనంతవరకూ సరిచేసుకున్నాను. ఆపై మీ ఇష్టం.
ధన్యవాదాలు మీ స్పందనకు.
బెహెన్ జీ ,
Deleteమన యిరువురి మధ్య యిచ్చి పుచ్చుకోవటాలు ఏమీ లేవు కనుక , అపార్ధాలకు తావే వుండకూడదు . నా వ్యాఖ్య నచ్చితే సరి చేసుకోవచ్చు , లేకుంటే లైట్ గా తీసుకోవచ్చు . చాలా మంది ముక్తసరిగా బాగుంది అని మెచ్చుకోవటంలో , అవతలవారు నొచ్చుకోకుండా సంతోషించే అవకాశం ఎక్కువ వుంది . ఇక నుంచి , నేను ఆ నలుగురి బాటలోనే నడవాలనుకొంటున్నాను .
నిన్ను నేను అపార్ధం చేసుకోవటం లేదు . మన యీ పరిచయం యిలాగే వుండాలని మనసారా కోరుకొంటున్నాను .
థాంక్ యు సర్.
ReplyDeleteఆశ నిరాశల సుఖదు:ఖాల ఆటవిడుపుల్లో ... మువ్వన్నెల తెరచాపను అడ్డుపెడుతుంది, వరకు
ReplyDeleteనేటి వాస్తవికత కంటతడి పెట్టించిన,
దిగాలుపడిన భారతమ్మకు ధైర్యం చెప్తూ -
గండుచీమలు కొండను మింగలేవనీ..,
ఏనుగు ను కుక్కలెప్పుడూ గెలవలేవనీ..,
అమ్మపాల రుణాన్ని అసురులడ్డుకోలేరనీ....,
స్పూర్తితో చెప్పడం చాలా చాలా బాగుంది మెరాజ్ గారు.