మనో...విన్నపం
నిన్ను నువ్వు కాదేమో అన్నానో ..,కోపం నీకు.
కానీ... నువ్వు నువ్వు కాదనే నమ్మకం నాకు.
నిన్ను వెతికే నెపంతో నన్ను నేను,
జారవిడుచుకుంటుంటాను.
వ్యక్తిగతం నుండి నిన్ను గతం గానే ,
స్వీకరిస్తాను నేను .
వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు,
చలనానివే కావచ్చు,
కానీ, నా మనోదారిలో ఎదురైన ..,
పసిపాపవే నాకు.
నీకు తెలుసా...?
నిను నెలవంకను చేసి ,
వేల తారకలు నీ చుట్టూ బ్రమించే వేళ,
విరిగిపడిన వెన్నెల కిరణ్ణాన్నై ..,
నేలరాలుతుంటాను.
కానీ ,సమూహాన్ని వీడి,
నా నెత్తుడి అడుగుల వెంట చూపు సారించి,
నను అందుకొనే వరకూ
విశ్రమించని నెలరేడువు నీవు.
నా శిరస్సుపై మోసే నమ్మకాన్ని
అతి పదిలంగా చూసుకుంటూ..,
అలుపెరుగని అభిసారికలా....,
అను నిత్యం నిరీక్షిస్తుంటాను.
ఓ వెన్నెల సంతకమా..,
ఓ అరవిరిసిన వసంతమా..,
అలుపెరుగని సమీరమా...,
నా అపురూప వరమా..,
ఏ కొనలో విరిసినా..,పరిమళమై కదలి రావా...?
'వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు,
ReplyDeleteచలనానివే కావచ్చు,
కానీ, నా మనోదారిలో ఎదురైన ..,
పసిపాపవే నాకు. ' ఈ వాక్యాలు అద్భుతం... ఎంతటి ధీమంతులైన ఎక్కడో ఒక చోట పసి మనసుతోనే ఉంటారు...
సురేష్ గారూ,మొదటగా మీకు నా బ్లాగ్ కి స్వాగతం.
Deleteమీరన్నది నిజమే..,ప్రతి వ్యక్తిలోనూ ఎప్పుడో ఒకప్ప్పుడు పసితనం బైట పడుతుంది.
ధన్యవాదాలు మీ స్పందనకు.
ఈ మనో విన్నపం కవితకి నాదో విన్నపం .
ReplyDeleteఈ క్రింద పంక్తులు దాదాపుగా అందఱి జీవితాలలో తెలిసో , తెలియకో జరుగుతూనే వుంటుంది .
" నిన్ను వెతికే నెపంతో ,
నన్ను నేను,
జారవిడుచుకుంటుంటాను . "
ఇక కొన్ని సవరణలు అవసరమనిపించింది .
నిన్ను నువ్వు కాదేమో అన్నాననా ! ఆ కోపం నీకు ,
కానీ... నువ్వు నువ్వు కాదనే నమ్మకం మాత్రం నాకు .
నిన్ను వెతికే నెపంతో ,
నన్ను నేను,
జారవిడుచుకుంటుంటాను.
వ్యక్తిగతం నుండి ,
నిన్ను గతం గానే ,
స్వీకరిస్తాను నేను .
వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు,
చలనానివే కావచ్చు,
కానీ, నా మనోదారిలో మాత్రం ,
ఎదురైన పసిపాపవే నాకు .
నీకు తెలుసా...?
నిన్ను నెలవంకను చేసి ,
వేల తారకలు నీ చుట్టూ భ్రమించే వేళ,
విరిగిపడిన వెన్నెల కిరణాన్నై ,
నేలరాలుతుంటాను .
కానీ , సమూహాన్ని వీడి,
నా నెత్తుటి అడుగుల వెంట చూపు సారించి ,
నన్ను అందుకొనే వరకూ
విశ్రమించని నా నెలరేడువు నీవు.
నా శిరస్సుపై మోపిన ఆ నమ్మకాన్ని ,
అతి పదిలంగా చూసుకుంటూ ,
అలుపెరుగని అభిసారికలా ,
అను నిత్యం నిరీక్షిస్తుంటాను.
ఓ వెన్నెల సంతకమా !,
ఓ అరవిరిసిన వసంతమా !,
అలుపెరుగని సమీరమా !,
నా అపురూప వరమా !,
ఏ కొనలో విరిసినా ,
పరిమళమై కదలి రా ....
శర్మాభాయ్, మీ కవితను యధాతదంగా పెట్టేశాను.
Deleteమీరు చేసిన మార్పులు బాగున్నాయి, ధన్యవాదాలు.