నీడనిచ్చిన నా చెలి
అను నిత్యం నన్ను వెన్నంటి ఉండే నా చెలి
హటాత్తుగా అదృశ్యమైంది.
తన అంతరంగ బందీఖానా నుండి
నన్ను విముక్తుణ్ణి చేసింది.
తన మాటల స్పర్శతో లాలిస్తూ,
నా అనాలోచిత పలుకులనే
అమృతగుళికలుగా,
స్వీకరించేది.
అడుగడుగునా అక్షర సుగంధమై,
భావ సోపానమై నా పాదాల కింద,
తన అరచేతులుంచేది.
తనో అనుభవ వటవృక్షమైననూ ,
నా ముందు నేల తంగేడులా,
తలవంచేది .
ఎన్నోసార్లు అనుకోని ఒప్పందాలూ ,
మరెన్నోసార్లు నిశ్శబ్ద సంకేతాలూ,
పలితంగా..,కమ్ముకొనే కారుమేఘాలూ .
నా చుట్టూ ఆమె కట్టే సాలీడు దారాలను సైతం,
భరించలేని సున్నితుడనై ,
భావోద్రేకుడనై ...,
మన:చంచిలుతుడనై ,
మౌనరోదితుడనై,..హోరెత్తే కడలి తరంగాన్నై,
ఆమె కాలికింది భూమిని లాగేసుకున్నాను.
ఆ సమయాన అలిగిన నా అభిసారిక,
నన్ను పరాదీనుని చేసి ,
పయనమై సాగిపోయింది.
అర్దంలేని అపోహలతో, అపార్దాలతో,
అదృశ్యమై పోయింది.
ఆమె నీడ మాత్రమే నాకు మిగిలింది.
కనుక ప్రేయసిని అతి సున్నితంగా ట్యాకిల్ చెయ్యాలని అర్ధం చేసుకోవటం ఎంతైనా మగ మహారాజులకు అవసరం అని చెప్పకనే చెప్పారు .
ReplyDeleteనైస్ .
మీరు చెప్పారూ అంటే అంతే మరి :-)
DeleteEnding chaalaa baagundi akka:):)
ReplyDeleteథాంక్స్ కార్తిక్
Deleteఅడుగడుగునా అక్షర సుగంధమై,
ReplyDeleteభావ సోపానమై నా పాదాల కింద,
తన అరచేతులుంచేది. చాలా బాగారాశారండి.
ధన్యవాదాలు పద్మా.
DeleteThank you sir.
ReplyDeleteఫాతిమాగారు,
ReplyDelete------నా చుట్టూ ఆమె కట్టే సాలీడు దారాలను సైతం,
భరించలేని సున్నితుడనై ,
భావోద్రేకుడనై ...,
మన:చంచిలుతుడనై ,
మౌనరోదితుడనై,..హోరెత్తే కడలి తరంగాన్నై,
ఆమె కాలికింది భూమిని లాగేసుకున్నాను. -----
"ఉద్వేగమంతా అక్షరాలలో గుమ్మరించేశారు, భావాలు కవితలుగా మారి అల్లుకుంటున్నాయి."
ధన్యవాదాలు మీ స్పందనకు
Deleteనాకు ఆమె గుర్తుకొచ్చింది...మేడం. కవిత చాలా బాగుంది.
ReplyDeleteఆమె గుర్తుకు రావాలనే రాసింది అహ్మద్ గారూ.:-)
Deleteఆ సమయాన అలిగిన నా అభిసారిక,
ReplyDeleteనన్ను పరాదీనుని చేసి ,
పయనమై సాగిపోయింది.
అర్దంలేని అపోహలతో, అపార్దాలతో,
అదృశ్యమై పోయింది.
ఆమె నీడ మాత్రమే నాకు మిగిలింది.
అద్భుతంగా ఉంది!
మెచ్చిన మీకు నా ధన్యవాదాలు సర్.
Delete