స్పందన కరువైన క్షణం
కాసిన్ని పలుకులను
తలపులనుండి తోడిపోసుకుంటూ..
ఎన్నిసార్లు నొత్తురోడిన గాయాన్ని..,
మాన్పుకోవాలనుకున్నానో ....,
ఎడతెగని మోహానికి ఆనకట్టవేసి,
కలల నౌకని కడలిలోనే,
బడబాగ్నికి ఆహుతి చేసుకున్నా..
జీవితమంతా .జీవితాన్ని
మరచిపోయెందుకే వెచ్చిస్తూ..,
మనస్సునెక్కడో పారేసున్నా..,
సగం చేసుకున్న ఈ ఊపిరి సంతకాన్ని,
నీ అకాల ఆగమనంతో..,
శాశ్వత చిరునామాగా మార్చుకున్నా..,
నీవు రాసిన వీడ్కోలు కాగితం ముక్కను
నా అసంపూర్ణ జీవన గ్రంధానికి,
ఆకరి పేజీగా అతికించుకున్నా. ..,
.,
బెహన్ జీ ,
ReplyDeleteపలుమార్లు అనుకుంటున్నా , ఈ నడుమ బ్లాగర్ అగ్రిగేటర్లలో " కవితా సుమహారం " కనపడటం లేదే అని . ఇప్పుడే ప్రాజెక్ట్ పనులనుంచి యింటికి చేరుకొన్నా . బ్లాగర్ అగ్రిగేటర్ చూడగానే మనసు కుదుటపడింది .
ఇక చదివిన తర్వాత ఆసాంతం ఆనందం చెందింది .
జీవితమంతా ,
ఈ జీవితాన్ని,
మరచిపోయెందుకే వెచ్చిస్తూ..,
మనస్సునెక్కడో పారేసున్నా...
చాలా మంది వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళకు తెలియకుండా వాళ్ళు చేస్తున్న పనే యిది . నగ్న సత్యమే . చాలా చాలా బాగుంది .
మీరు నా కవిత చదివినందుకు చాలా సంతోషంగా ఉంది భాయ్ సాబ్.
Deleteచాల బావుంది "తలపులనుండి తోడిపోసుకుంటూ.. ఎన్నిసార్లు నొత్తురోడిన గాయాన్ని..,మాన్పుకోవాలనుకున్నానో ....,"
ReplyDelete------------------------------------------------
ఆఖరు పుటగా అతికించుకోవాలనుకున్నా.......కాని ఎందరో ఒంటరి జీవితాలను చూసి స్నేహం పంచుదామని
క్రొత్త పుటలు అతికించా :-)
ధన్యవాదాలు మీ కొత్త పుఠలకు :-)
Deleteఅయ్యో!
ReplyDeleteపాపం :-)
Deleteబాగుంది.
ReplyDeleteధన్యవాదాలు సర్.
Deleteమీరజ్ మీతో ఏకీభవిస్తున్నాను . మనసును కదిలించింది .
ReplyDeleteదేవీ..థాంక్స్.
DeleteHow beautiful...what a sensitive emotion and how sensibly you have expressed. I am so glad I flund your blogspot.
ReplyDelete