నడిచే నెలవంక
ఈ చందమామని ఎవరో పారేసుకున్నారు,
కాదు ,కాదు గగనానికి అమ్మేసుకున్నారు.
మసిబారిన ఆకాశాన్ని అంటుకుని ,
కొడిగట్టిన దీపం లా వేలాడుతూ,
నాకు కనిపించాడు.
నిదురరాని రేయిని ,
ఆరుబైట ఆరబెడుతూ,
ఆకాశాన్ని చూశాను
శీతాకాలపు చలిరాత్రికి,
బుజ్జి కుందేలుపిల్లలా,
ముద్దు,ముద్దుగా,
నేలపైరాలిన నక్షత్రాల మద్య,
మినుగురులా మెరుస్తున్నాడు
చాపిన నాచేతుల్లో,
ఎగిరొచ్చి వాలిపోయాడు ,
సుతిమెత్తని చీరకొంగుతో..,
సున్నితంగా చిట్టి గడ్డంపై రాశాను,
పొగడపూలలా నవ్వాడు.
ఏ త్యాగానికై ఈ గందర్వుడు,
ఇలా గగనం విడిచాడో,
నేలపై ఎవరిని వెతుకుతున్నాడో..,
తిరణాలలో తప్పిపోయిన పసి కూనలా,
బిక్కు,బిక్కు మంటున్నాడు.
ఒక నిస్సారమైన ఆత్మాహననం నుండి ,
తనని తాను రక్షించుకుంటూ,
జీవన రేఖపైనే బ్రమిస్తున్నాడు,
నా చిటికిన వేలు పట్టుకొని ,
మెల్ల,మెల్లగా నడుస్తున్నాడు,
ఆ స్వప్న సముద్రాన ,
సూర్యో్దయమైనాడు.
" నిదురరాని రేయిని ,
ReplyDeleteఆరుబైట ఆరబెడుతూ,
ఆకాశాన్ని చూశాను "
కవితలో ప్రతి అక్షరమూ బాగుంది.
ప్రతి ప్దమూ, దాని నిగూఢ భావమూ
హృదయానికి హత్తుకున్నాయి.
కవితను ఆస్వాదించిన ,మెచ్చిన మీకు ధన్యవాదాలు సర్.
Delete??? :)
ReplyDeleteఉన్నాడులెండి ఓ బుజ్జిపండు .
Delete"మసిబారిన ఆకాశాన్ని అంటుకుని ,
ReplyDeleteకొడిగట్టిన దీపం లా వేలాడుతూ,
నాకు కనిపించాడు. "
చక్కటి భావం . బాగుంది .
అన్నయ్యా.. ధన్యవాదాలు .
Deletenadiche nelavankanu chusukuntu nannu vadilesavu enduku akka nee chitikenavelu pattukuni mella mellaga nadichinannu adrusyam chesava nenu nee chinna
ReplyDeleteసుధా.., ఎన్ని నెలవంకలున్నా....,నిండు చంద్రుడువే నువ్వు.
Deleteనిన్ను తమ్మునిగా కాదు కొడుకుగా భావిస్తాను నేను .
Cute pic with lovely poem Meerajgaru.
ReplyDeleteThanks padma dear.
Delete