కలం కదిలించు
కాలమనే కత్తి మీద
కలాన్ని కదిలించు
ఎగిరిపడే నిప్పురవ్వలు
కవివైతే నిన్ను కాల్చేస్తాయి.
ఏ మూలనో అణువంతైనా ,
ఆవేశముంటే ,
చచ్చిన శరీరాంగమైన,
నీ కలాన్ని కదిలించు.
పుక్కిట పురాణాలనూ,
బొంకుల బోగాతాలనూ ,
చెత్తబుట్టకు చుట్టాన్ని చెయ్యి .
బాల కార్మికులకై అక్షర బాటవెయ్యి.
మతాల దడులూ, కులాల కంచెలూ ..,
కట్టి ,గద్దలు తన్నుకుపొయే ,
ఉద్యోగాలను ఉట్టికొట్టి ,
రచ్చకీడ్చి , నీ కలంతో కడిగెయ్యి .
ఆకటి పేగులకు
అన్నం ముద్దవి కావాలంటే,
నీ కలాన్ని అనలం లో కాల్చి ,
సానబట్టి , వర్గ ,వర్ణ ప్రాంతీయ బేదాలపై ,
వేటు వేయి.
(లేదంటే .... కవులారా మనమంతా
పుచ్చిపోయిన మన కలం పాళీ విరిచి ,
వెన్నెల్లో తనువును ఆరబోసుకున్న
పూభోణి గురించి రాసుకొని
మనకు మనమే చొంగ కార్చుకుందాం )
పుక్కిట పురాణాలనూ,
ReplyDeleteబొంకుల బోగాతాలనూ ,
చెత్తబుట్టకు చుట్టాన్ని చెయ్యి .
ఇలా రాయడం మీకే చెల్లు
ధన్యవాదాలు పద్మా,
Deleteమీ అభిమానం ఎనలేనిది
సద్భావనతో కూడిన సత్సందేశం .
ReplyDeleteకొంచెం క్రమ లోపం అనిపిస్తున్నది నాకు . ఓ మారు ఈ కోణంలో పరికించి చూడు .
అన్నయ్యా..,నమస్తే,
Deleteధన్యవాదాలు
మీ మానవీయ దృక్పదానికి దర్పణాలు మీ కవితలు.
ReplyDeleteచక్కటి సందేశం. బాగుంది మెరాజ్ గారు.
భారతి గారూ, మీ స్పందన నాకు చాలా బలాన్నిస్తుంది.
Deleteఅప్పుడప్పుడూ (వీలున్నప్పుడు ) చూస్తూ ఉండండి
kavitha bagundi medam.
ReplyDeletewww.sakshyammagazine.blogspot.com
అహ్మద్ జీ..అస్సలామలేకుం ,
Deleteధన్యవాదాలు
అహ్మద్ జీ..అస్సలామలేకుం ,
Deleteధన్యవాదాలు
kaalamane nippulagundam ninnu dahinchina aanippulaguntalo budida kakunda kavi y nilichavu naa ayushulo konchamtheesukoni charitralo nilichipo akka
ReplyDeleteసుధా, చాలా సంతొషం , తమ్ముని ఆయువు అక్క ఎప్పటికీ కోరదు .
Deleteసుధా, చాలా సంతొషం , తమ్ముని ఆయువు అక్క ఎప్పటికీ కోరదు .
Delete