అంకురమై....,
వాళ్ళు ఉరి తీసింది రైతు(త)లని కాదు,
పచ్చటి పంట కలని.
ఆరుకాలాల పాటు ఆటలాడే పంటకాలువ,
కుంటిదై కుంచించుకు పోయింది .
ఇసుక పోగొట్టుకొన్న ఏటిగట్టు,
కబ్జాబాబుల చుట్టమై బడాబాబుల చేతుల్లో చట్టమైంది.
అంగడి సరుకు(గా మారిన) మాగాణి,
పచ్చనోట్ల పోటుకి పడుపుగా మారింది.
విస్తరించే వింత సౌధాలను చూసి,
అడవులు సైతం ముడుచుకుపోతున్నాయి.
నెత్తురు పులుముకున్న సూర్యుడు,
దుర్బిక్ష అనంతపై కాలుదువ్వుతున్నాడు.
వలస ప్రజతో నిండుచూలాలైన నగరం,
పల్లె బిడ్డలకు సవతి తల్లయిపోయింది.
జనకాలుష్యానికి , ధనకాలుష్యం తోడై.,
కృషీవలుడంటే కూలివాడనుకుంటుంది.
మట్టి తల్లిని గొడ్డుమోతుని చేసి,
పిజ్జా,బర్గర్ల, టెస్ట్యూబ్ బిడ్డలతో కాలక్షేపం.
అప్పుల ఊబిలో ఆత్మహత్య చేసుకున్న రైతుకు ,
తీర్పులూ,ఓదార్పులూ,కంటితుడుపు రాయితీలూ...,
కుళ్ళు రాజకీయపు కుడ్యాలు కూల్చెయ్యి,
సరిహద్దు యుద్దాలను రద్దు చెయ్యి.
నల్లబజారులో నడిచే బియ్యాన్ని తెచ్చి,
బీదల కడుపు నింపెయ్యి.
ఫాతిమాజీ ,
ReplyDeleteఈ పద ప్రయోగం చాలా బాగున్నది .
వలస ప్రజతో నిండుచూలాలైన నగరం,
పల్లె బిడ్డలకు సవతి తల్లయిపోయింది.
జనకాలుష్యానికి , ధనకాలుష్యం తోడై.,
కృషీవలుడంటే కూలివాడనుకుంటుంది.
ఈ క్రింద కొంచెం మార్పు చేర్పులతో ఇంకా ఈ కవితకు సామర్ధ్యం , ఆయువు పెరుగుతుంఅన్న భావనతో దిద్ది పంపుతున్నాను .
ఈ మార్పు , చేర్పులు అవసరం అనిపిస్తే సరి చేసుకోగలవు . లేకుంటే లైట్ గా తీసుకొని ఈ వ్యాఖ్యలను యింతటితో తీసివేయవచ్చు .
వాళ్ళు ఉరి తీసింది రైతు ( త )లని కాదు,
ఆరుకాలాల పాటు పండే పంటకాలువ,
కుంటిదై కుచించుకుపోయింది .
ఇసుక పోగొట్టుకొన్న ఏటిగట్టు,
కబ్జాబాబుల చుట్టమై,
బడా బాబుల చేతుల్లో / చేతల్తో చట్టమైంది .
అంగడి సరుకు( గా మారిన ) మాగాణి,
పచ్చనోట్ల పోటుకి పడుపుగా మారింది.
అడవులు సైతం విస్తుపోతూ , కనుమఱుగవుతున్నాయి .
పిజ్జా,బర్గర్ల, టెస్ట్యూబ్ బిడ్డలతో సరిపెట్టుకోమంటున్నారు .
తీర్పులూ,ఓదార్పులూ,రాయితీలూ కంటితుడుపులుగా మిగిలిపోయాయి .
నల్లబజారులో నక్కిన బియ్యాన్ని తెచ్చి,
అన్నయ్యా..ధన్యవాదాలు.
DeleteMeraj akka....mee manobhavaalanu chaalaa baagaa rasaru.
ReplyDeleteకార్తీక్, ధన్యవాదాలు
Deleteమీరూ రైతు గురించే రచించారన్న మాట. బావుంది.
ReplyDeleteరైతు గురించి రచించటం నా భాగ్యం అనుకుంటాను సర్.
Deleteపేదల కష్టాలని కవితారూపంలో చెప్పి ఆలోచింపచేసి మనిషుల్ని చైతన్యవంతం చేయగల సత్తా మీకే ఉంది.
ReplyDelete