Pages

Tuesday, 8 July 2014

మనో వేదన


    

    





   మనో వేదన 

    ప్రతిరాత్రీ.... నా కళ్ళలో ..,
    నెత్తుటి నదులు ప్రవహిస్తూ...,
    నన్ను గాయపరుస్తుంటాయి.

    చిక్కటి ఈ చీకటి గదిలో...,
    అకాల దు:ఖానికి ఆనకట్ట వేయలేనంటూనే..,
    ఊపిరి ఉరికొయ్యెక్కుదంటుంది .

    తుది లేని మదిలోగిలిలో..,
    అడుగిడేందుకు అయిష్టపడుతూ..,
    నీ పాదాలు పారిపోతుంటాయి.

    నిరసించే...నీ పలుకుల ములుకులతో
...,
    మౌనమే  సరైందేమో అంటూ...,
    ముక్కలైన గుండె ఒక్క ఉదుటున మూగపోయింది.

    శిధిల దేవాలయపు పాకుడు మెట్టునై....,
    జారే నీ పాదానికి ఆసరా నేనంటూ..,
    అరచేతులు సోపానాలవుతున్నాయి.

    సఖుడా....,ఎవరూ లిఖించని భావాలతో'
    అక్షర సాలీడునై...అంతుచిక్కని కావ్యానికై...,
    వ్యధా సిరానై ....అక్షరాలను నీ ఎదపై సందిస్తున్నా..,




6 comments:


  1. భావం చాలా బాగుంది . కొంచెం ఈ మార్పులతో ఇంకా బాగుంటుందనుకుంటున్నా .
    చదివి అవసరమనిపిస్తే మార్పులు చేయగలరు . ఇది నా మనవి . మనవి ఎప్పుడూ మనవాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే చేయబడ్తుంది .
    ఈ క్రింది లైనె కమెంటులో తీసివేయండి .
    మవునమే యిలా కాకుండా ఎం ఏ యు టైప్ చేస్తే మౌనం వస్తుంది లేఖిని లో .



    ప్రతిరాత్రీ.... నా కళ్ళలో ..,
    నెత్తుటి నదులు ప్రవహిస్తూ...,
    నన్ను గాయపరుస్తుంటాయి.

    చిక్కటి ఈ చీకటి గదిలో...,
    అకాల ఈ దు:ఖానికి ఆనకట్ట వేయలేనంటూనే ,
    ఊపిరిని ఉరికొయ్యెక్కద్దంటోంది

    నిరసించే...నీ పలుకుల ములుకులతో...,
    మౌనమే సరైందేమో అంటూ...,
    ముక్కలైన గుండె ఒక్కుదుటున మూగపోయింది.

    తుది లేని మదిలోగిలిలో..,
    అడుగిడేందుకు అయిష్టపడుతూ..,
    నీ పాదాలు పారిపోతున్నాయి.

    శిధిల దేవాలయాన పాకుడు మెట్టునై....,
    జారే నీ పాదానికి ఆసరా నేనంటూ..,ఈ నా
    అరచేతులు సోపానాలవుతానంటున్నాయి.

    సఖుడా....,ఎవరూ లిఖించని భావాలతో'
    అక్షర సాలీడునై...అంతుచిక్కని కావ్యానికై...,
    నా వ్యధనే సిరాగా ....
    అక్షరాలను నీ ఎదపై సందిస్తున్నా..,

    ReplyDelete
  2. సర్,(అన్నయ్యా) నా కవితను మీరు చెప్పినట్లే సరిచేశాను,
    మీ కామెంట్ నాకు సాహితీ దారి చూపిస్తుంది. ఇలాగే ఇంకా ఎన్నో సలహాలను ఆశిస్తూ..మెరాజ్

    ReplyDelete
  3. Replies
    1. కార్తీక్ థాంక్స్

      Delete
  4. Replies
    1. వర్మాజి నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete