మరోసారి ఓడిపోతూ...,
ఈ నిశ్శబ్ద నిశి రాతిరిని,
రెప్పలార్పుతూ ..తదేకంగా చూస్తున్నా..,
తూర్పు పవనమొకటి తేలివచ్చి,
పసితనపు తలపుని తాకించి వెళ్ళింది.
ఆనాటి సౌధమింకా అలాగే ఉంది,
ఎప్పటిలాగే చంద్రునితో పహారా కాయిస్తుంది.
ఎత్తిపట్టుకున్న పట్టుపావడాతో,
మూసుకున్న కళ్ళతో...వెన్నెటి గుడ్ల ఆటాడుతూ..,
చిన్నమ్మా...అక్కడ ముళ్ళుంటాయి...,
అర్దింపూ,అర్ద్రతా... అవే అరచేతులు,
నా అరికాళ్ళ కింద మెత్తటి తివాచీలై.....,
అరే ఇక్కడో పారిజాతం ఉండాలి,
రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవీ...,
గొప్ప తోడుని అడిగిన ఆ మొక్కులేవీ..?
గుడ్డబొమ్మలకి పెళ్ళిళ్ళు చేసిన,
చిన్నారి ముత్తయిదువ ఆ చిన్నమ్మ ఏదీ..?
ఆమె నడిచిన చిట్టి పాద ముద్రలేవీ..?
కాలమంతా రంగుల రాట్నమై,
గిర,గిరా,తిరిగే చలన చక్రమై,స్ఖలన దు:ఖమై..,
యుగాల నాటి ప్రశ్నాపత్రమై..,
మరణాంతరం సమాదులపై పాతిన,
శిలా పలకమై,బాల్యాన్ని పాతిపెట్టిన,
శిథిల సౌధమై..,
ఇనుప చట్రాలలో ఇరుక్కున్న చిన్నమ్మ,
ఈ నిశీథి సౌధాన ఆత్మను వదలి ,
విలువలేని శరీరాన్ని శిలువ వేసుకుంది.
ఆరంభం ఆనందంతో సాగిపోయింది . ముగింపు విషాదంతో ముగిసింది . అయినా బాగుంది .
ReplyDeleteఈ నిశ్శబ్ద నిశి రాతిరిని,
రెప్పలార్పుతూ ..తదేకంగా చూస్తున్నా..,
తూర్పు పవనమొకటి తేలివచ్చి,
పసితనపు తలపుని తాకించి వెళ్ళింది.
ఆనాటి సౌధమింకా అలాగే ఉంది,
ఎప్పటిలాగే చంద్రునితో పహారా కాయిస్తుంది.
ఇనుప చట్రాలలో ఇరుక్కున్న చిన్నమ్మ,
ఈ నిశీథి సౌధాన ఆత్మను వదలి ,
విలువలేని శరీరాన్ని శిలువ వేసుకుంది.
ఆనందముతో సాగే జీవితాలలో ఇలాంటి మలుపులే ఎక్కువగా కనిపిస్తాయి,
Deleteబహుశా వారు తీసుకున్న నిర్నయాల వల్లా కావచ్చు,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు సర్.
తూర్పు పవనమొకటి తేలివచ్చి,
ReplyDeleteపసితనపు తలపుని తాకించి వెళ్ళింది. Chaalaa baagundi akka:):)
తమ్ముడూ..థాంక్స్.
Deleteచిన్ని బంగారు తల్లికెన్ని కష్టాలు......
ReplyDeleteబంగారు తల్లి కాబట్టే అన్ని కష్టాలు :-)
Delete