వాక్కు.
వేదన నిండిన గుండెకు మరపుమందు నిస్తుంది.
మది వాకిట నేర్పుగా ...ఓర్పు పరదాకడుతుంది ..,
నీ చల్లని వాక్కు.
విచక్షణ లేని క్షణాన రక్షణలా,
విరిగిన మానస వీణను అతికించి సృతించేలా చేస్తుంది,
నీ చక్కని వాక్కు.
చీకటి తరువు నుండి వెన్నెల కుసుమాలను పూయించి,
మది గాయాలు మానపటానికి మాటల తేనెలతైలం పూస్తుంది.
నీ మంచి వాక్కు.
కనుల నీరు తుడిచి కలత పోగొట్టి ,
చెంత చేర్చుకొని సేద తీరుస్తుంది ,
నీ చెలిమి వాక్కు.
గనీభవించిన కాలాన్ని ద్రవీబవించి,
అస్తమించే నా బ్రతుకునకు సమస్తమై నిలుస్తుంది,
నీ స్వాంతన వాక్కు.