Pages

Friday, 11 January 2013


నాన్న.


నీ చుట్టూ భ్రమిస్తూ..,
నీకై  తానూ శ్రమిస్తూ.

నీ పట్టుదలని భరిస్తూ..,
తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ,

నీ కాళ్ళమీద నిన్ను  నిలబెడుతూ...,
తన కాలి సత్తువ  అరగదీసుకుంటూ..,

నీ  కోరికల చిట్టా తీరుస్తూ..,
తన కోరికలే మర్చిపోతూ,

నీ సరదాలను  భరిస్తూ..,
తన నిద్ర మరచి జాగరణ చేస్తూ..,

కోడలి  ధూషణని  మౌనంగా బరిస్తూ..,
మనవలకు కళ్ళెం లేని గుర్రంగా మారుతూ..,

కుక్కకీ, తనకీ ఒకే రకమైన ముద్ద పెట్టినా...,
తన ముంత  తలవాకిటనే  పెట్టినా..,

పెదవి  విప్పని  నీ  పితామహుడు ఆశతో ఉండేది ,
అసలుకంటే వడ్డీపై ఉన్న మమకారంతోనే..

గుర్తుచేసుకో...నీఎ చిల్లు జేబు నింపినదీ ఆయనే.
నీ బతుకు బండికి చక్రం బిగించిందీ  ఆయనే.

నీవు తప్పించే పున్నామ  నరకం కోసం..,
ఇప్పుడు ఈ నరకాన్నీ అనుభవిస్తున్నదీ  ఆయన..

ఎవరో కాదు నీ వేలు పట్టుకొని నడిపించిన ,
చలనమున్న శవంలా  కనిపించే ..నిన్ను కన్న  నీ నాన్న.

7 comments:

  1. బాగుంది మెరాజ్ గారూ!
    ఎప్పటిలా మీ శైలిలోనే, పుత్రరత్నాలకి తెలీని మరో నాన్న కోణం.

    ReplyDelete
  2. నిజమె కదా.. నాన్న కూడా నిర్లక్ష్యం చెయబడుతున్నారు అనే విషయం తెలీటం లెదు జనాలకు. ధన్యవాదాలు మీ అభిమానానికి.

    ReplyDelete
  3. nice!aunty[Nausheen}

    ReplyDelete
  4. Thank you my dear Nousheen beta.

    ReplyDelete
  5. హృదయాన్ని తాకేలా మీలా మరెవ్వరూ వ్రాయలేరేమో మెరాజ్ గారు!

    ReplyDelete
  6. భారతి గారూ, ఇలా రాస్తున్నాను అంటె అరమరికలు లేని మీ అభిమానం ఇంకా ఉన్నందుకే.

    ReplyDelete