Pages

Friday, 4 January 2013

అన్నదాత

అన్నదాత


విత్తు నాటి
కళ్ళలో  ఒత్తులేసుకొని.

చినుకు కోసం ,
ఆకాశం వంక చూపులేట్టుకొని.

పంట కోసం,
తొండలు గుడ్లు పెట్టిన భూమిని నమ్ముకొని.

పరువు కోసం,
కరువునే ఎదిరిద్దామనుకొని.

కొంప కోసం,
మనిషితనాన్నే  నమ్ముకొని.

అప్పు కోసం,
అధికారుల ముందు చేతులు కట్టుకొని.

బువ్వ కోసం,
అహోరాత్రులూ తనను తాను  కష్ట పెట్టుకొని.

గువ్వల కోసం,
పండిన   కంకులనే నట్టింటే వేలాడగట్టుకొని.

అన్నగా పిలవబడి,అమ్మగా  తలవబడే వాడే  రైతంటే.
మట్టికొట్టుకొని  ఉన్నాడని మనం నెట్టివేసే వాడే రైతంటే.

అన్నపూర్ణ  అక్షయపాత్ర  నింపి,మన ఆకలి  తీర్చేవాడే  రైతంటే.




8 comments:

  1. రైతే రాజన్న మాట పేరుకే మిగిలింది.

    ReplyDelete
    Replies
    1. రైతు అన్నివిదాలా నాసనం అయిపొతున్నాడు, భయంగా ఉంది, మనం ఎటు పొతున్నామొ అని.

      Delete
  2. అన్నమే కరవైన అన్నదాతకు
    దన్నుగా నిలబడ్డ సహృదయతకు అభినందనలు .

    ReplyDelete
    Replies
    1. నిజమె సర్,బీద రైతు రొజు కూలీ అయ్యాడు. యె ప్రభుత్వమూ పట్టించుకొవటం లెదు.

      Delete
  3. తనకు బువ్వ లేకపోయినా
    గువ్వలకు కాస్త పెట్టాలనుకున్నాడు
    కనుకనే మీ రైతు అన్న దాత.
    ఆ మాట అన్నప్పుడల్లా మీరు రైతు బిడ్డలు
    అని గుర్తుకి వచ్చి సంతోషం వేస్తుంది.
    నేను రైతుని కాలేదే అని దిగులేస్తుంది!

    ReplyDelete
  4. సర్, మీరు రైతు అయితె, ఎంత బాగుండెదొ. నిజాయితీ, నిబద్దత గల ఆఫీసర్ గా మీకున్న పేరు తెలుసు నాకు.నెను రైతు బిడ్డనె అందుకె రైతు కస్టం చూస్తుంటె గుండె చెరువవ్ తుంది. మీరు టూర్ వెల్తున్నారని విన్నాను. క్షెమంగా వెళ్ళాలని దెవుని కొరుకుంటున్నాను.

    ReplyDelete
  5. ప్రతీ మీ కవిత -
    మీ నిర్మలమైన కరుణాపూరితమైన హృదయానికీ,తపనకీ, ఆర్తికీ దర్పణం.
    మీ సరళ సున్నిత మానవత స్వభావానికి ప్రణమిల్లుతున్నాను మెరాజ్ గారు.

    ReplyDelete
  6. Bhaaratee.. yenta maata. mee manchi manassu alaage anipistundi. nenu kavitalu hobby gaa raayatam ledu, comments kosamoo kaadu. naa aavedananu aksharaalato swaantana pondutunnaanu. mee vanti sister ni sampaadinchukunnaanu.

    ReplyDelete