Pages

Sunday, 30 December 2012

దాహార్తి




దాహార్తి 

దేహాన్ని మరచిపోయిన తలపులు.
గొంతును తడుపుకొనే పలుకులు.

మదిలో ఎగిసిపడే ఆవేశపు ఘోష,
గుండెలో మిడిసిపడే అబద్దపు శ్వాస.

తనువును  కాల్చేసే  భగ్న  హృదయం,
మనువును కూల్చేసే  నగ్న నిర్ణయం.

అస్థిర పయనంలో ఎరుగని  గమ్యం,
అబద్ద గమనంలో తరిగిన సత్యం.

నిర్జీవి  రాతిపై  చెక్కిన  వేదనా  శిల్పం.
సజీవ  సమాదిపై  చిక్కిన శిదిల శల్యం.

అన్వేషిత  హృదయం  నిత్య  దాహార్ది,
స్వర్ణశోభిత  సమయం  నిత్య ప్రేమాన్వేషి.....ఇదీ జీవితం. 

4 comments:

  1. ఈ దాహార్తి ' ఇదీ జీవితానికి '
    పొడిగింపు అనుకుంటాను.
    జీవితంలోని వేదనను చక్కగా వర్ణించారు.
    పలుకు గొంతుని తడపడం కొత్త భావన!
    బాగుంది.
    వసంతం ఎప్పుడొస్తుంది?

    ReplyDelete
  2. సర్, నేను బ్లాగ్ సరిగా వాడటం లెదు. మీకు సమయం దొరికితె ఫెస్ బుక్ చూడండి.
    సర్ మీ అభిమానం ఉంటె వసంతం ఉన్నట్లె.

    ReplyDelete
  3. మెరాజ్ గారు ఫేస్ బుక్ లో మన స్నేహితులు వెంటనే వారి అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. ఆ ప్రోత్సాహంతో మరిన్ని కవితలు వ్రాయాలనే ఉత్సాహం పుడుతుంది. బ్లాగ్ లో వ్రాయడం వలన చదివిన వారి అభిప్రాయం తెలియజేయనప్పటికీ ఎంత మంది మన రాతలు నచ్చి బ్లాగ్ చూస్తున్నారో తెలుస్తుంది కదండీ. సమాజ శ్రేయస్సు కోసం మీరు రాసే రచనలు ఎక్కువమంది చేరే అవకాసం ఉంటుంది. దీర్ఘకాల ప్రణాళిక ఇది. ఏమంటారు?

    ReplyDelete
  4. jyoti, tappakundaa mee soochana paatistaanu, ayite blog kosam samayam vechhinchaleka potunnaanu,nijame mee vanti mitrulani, Ganga srenivas sir vanti guruvulanee kaadanatam sabyata kaadu. thank you dear.

    ReplyDelete