Pages

Sunday, 9 December 2012

అర్జీ







అర్జీ 

నింపలేకపోయింది మా పొట్ట, చేతికందిన పట్టా,
దరఖాస్తు చేసుకున్న కొలువు అడిగింది నోట్ల కట్ట.


నిస్సహాయపు జిందగీ, అసహాయపు బందగీ,
చుట్టాల వెక్కిరిపులూ, నిరసన చూపులూ.

బేకారుగాడు, బేవార్సు గాడూ అనే నీచులూ,
అరిగిన చెప్పులకు అతుకువేసుకుంటాననీ,
చిరిగిన టోపీకి పడిన చిల్లులు కుట్టుకుంటాననీ,
గల్లీ, గల్లీ నను చూసి వేసుకునే జోకులూ.

అప్పిచ్చిన పహిల్వాన్ల ఆగడాలూ,
ఆదీ అంతం లేని ఆలోచనలూ,
వడ్డీపై వడ్డీ, వడ్డించిన వడ్డనలూ.

తల్వార్ అంచున సాగే జీవితం,
అబ్బాజాన్ పరువునే పెట్టింది ఫణం.

చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, దాదీజాన్ రొగాలూ,
ఆపాజాన్ ప్రసవాలూ, సరీసృపాల్లా సాంఘిక బంధాలు.

వాటికై అబ్బాజాన్ వేస్తూన్న వేలుముద్రలు,
అప్పుడు పడతాయి ఆయన చేతిలో డబ్బులు.

అసమర్దపు పాలకులు, వాళ్ళకు అన్నీ సందేహాలు,
నిరుద్యోగినైన నాపై, ఆటంక వాదిననే అనుమానాలు,
ఫజర్ నమాజ్ కెళ్ళి వస్తున్న నన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు,
నిర్దోషినైన నా ముఖానికి ముసుగులు, చేతులకు బేడీలు.

అప్ప్పులోళ్ళ అసాంఘిక చర్యల్లో, అబ్బాజాన్, అమ్మీజాన్ దోషులు,
అబ్బాజాన్, అమ్మీజాన్ కళ్ళల్లో కన్నీళ్ల సుడులు.

ఘనీబవించిన పహిల్వాన్ల కఠిన హృదయాలు,
ద్రవీభవించిన మా బీద హృదయాలు.

అసమర్ధపు బాటసారినై, గరీబీ రక్కసికి చిక్కి,
వేలాడుతున్నా నిరుద్యోగపు కొక్కానికి.

పాపపుణ్యాల చిట్టా నాకు తెలీదు,
ఈ రెక్కలు తెగిన పక్షులకు నీవే దిక్కు.

అన్నీ తెలిసిన అల్లా! నీకు నా అర్జీ ఏమిటో తెలుసు,
అనంత కరుణామయుడా! అపార క్రుపాశీలుడా!

ఆలకించు మా దువా, చుక్కానివై నువ్వే చూపు మాకు తోవ.




34 comments:

  1. వావ్....
    ఇది కుడా అల్టిమేట్...
    పదాలు ఎలా దొరుకుతాయి అక్కా మీకు?

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ, మీ హాస్య కథ చదివాను, ఎంత బాగుందొ...

      Delete
  2. మేరాజ్ గారు......Simply superb! That is all I have to say.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, ధన్యవాదాలు.

      Delete
  3. చాలా బాగారాసారు ఫాతీమాగారు.

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, మీకు నా ధన్యవాదాలు.

      Delete
  4. మీ ఆర్జీ మనసుకి హత్తుకునేలాగుంది.

    ReplyDelete
    Replies
    1. స్రుజనగారూ, నా కవిత క్రమము తప్పకుండా చదివె మీకు నా ధన్యవాదాలు.

      Delete
  5. ఆ అల్లా అందరి ఆర్జీలు ఆమోదిస్తే ఇంక ఫాలో అయ్యేవాళ్ళుండరేమో అల్లాను!

    ReplyDelete
    Replies
    1. తర్కం గారూ, దేవునికి తెలుసు దెన్ని ఆమొదించాలొ..,
      నా బ్లాగ్ చూసిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  6. బాగుందండీ కవిత.
    ఈ ముత్యాల్లో మేమేరుకున్న పద ముత్యాలు...
    గరీబీ రక్కసికి చిక్కి,
    వేలాడుతున్నా నిరుద్యోగపు కొక్కానికి....

    ReplyDelete
    Replies
    1. మీరు చదివితె చాలు, అక్షర ముత్యాలు యెరుకుంటె మేముకూడా మీచిత్రాలు తెచ్హుకుంటాము.
      చిత్రకారులు మెచ్హటం సంతొషం.

      Delete
  7. బాగుందండీ కవిత.
    ఈ ముత్యాల్లో మేమేరుకున్న పద ముత్యాలు...
    గరీబీ రక్కసికి చిక్కి,
    వేలాడుతున్నా నిరుద్యోగపు కొక్కానికి....

    ReplyDelete
  8. ఓ నిరుపేద నిరుద్యోగి మనస్సుకు దర్పణం మీ ఈ కవిత. బాగా వ్రాశారు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, నా కవితలు బాగున్నాయి అనె మీ అభిమానం చాలు నాకు.

      Delete
  9. అర్జీ అంటూనే ఘర్జించిన మరో కవిత.

    ReplyDelete
    Replies
    1. జోతి గారూ, ఘర్జించానా యెమొ అమాయకురాలిని పట్టుకొని అనటం లేదు కదా..
      ధన్యవాదాలు మీ అభిమానానికి.

      Delete
  10. బావుంది ఫాతిమా గారు.

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారూ, బాగుంది అన్నాఅరు చాలా సంతొషంగా ఉంది.

      Delete
  11. చాలా చాలా బాగుంది
    మీరన్నట్లు హృదయం ద్రవించేలా...

    ReplyDelete
    Replies
    1. ధాత్రి గారూ, సున్నిత మీ మనస్సుకి ధన్యవాదాలు.
      బ్లాగ్ దర్సించిన మీకు మరొ మారు ధన్యవాదాలు.

      Delete
  12. చాలా బాగుంది ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, నా కవితలు మెచ్చే మీకు నా కృతజ్ఞతలు.

      Delete
  13. బహు చక్కని కవిత ఫాతిమాజీ,-మీరలా వ్రాస్తూనే ఉండండి. మేము చదివి ఆనందిస్తూనే ఉంటాము.

    ReplyDelete
    Replies
    1. సర్, మీరు చదవటం సంతోషాన్నిస్తుంది.
      నా కవితలు మెచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

      Delete
  14. చాలా చాలా బాగుంది. ప్రాస కోసం లేదా కవిత చిక్కదనం కోసం మీరు హిందీ జొప్పించలేదని తెలుసు. మీ దువా అర్ధం అయింది. బీదరికం తో నలగిపోతున్న భాయీలపై పడే ముద్ర కి ఆవేదన చెందాల్సిందే!!

    ReplyDelete
    Replies
    1. వనజా, మీ విశ్లేషణ నా కవితకు అందాన్నిస్తుంది.
      మీరన్నట్లు ముస్లీం సోదరుల వేదన తీరితే చాలు , ఎన్నో కుటుంబాలు వీదినపడుతున్నాయి

      Delete
  15. ఫాతిమ గారు చాలా బాగుంది మీ పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారూ , మీరు నా ప్రతి కవితా చదివి నన్ను ప్రోత్సహించటం సంతోషం గా ఉంది.
      మీ అబిమానానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

      Delete
  16. మీ దువా సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు తప్పక వింటాడు

    ReplyDelete
    Replies
    1. సర్ ,( ఆమీన్). నా దువా అల్లా ఆలకించాలి. ఎందఱో ముస్లీం సోదరుల వేదన దూరం కావాలి.
      కవిత చదివి ఆశీర్వదించిన మీకు నా కృతఙ్ఞతలు.
      సర్, ఈవారం నవ్య లో మీ సీరియల్ "నీ వెనుక నేను " తో పాటు మీ కథ "బహుమతి " చదివాను, కథ మలచటంలో మీకు మీరే సాటి.

      Delete
  17. నిస్సహాయత లో వున్నా యువకుల అంతరంగం మీ బ్లాగ్ లో పరిచారు , ప్రాస కోసం కాకుండా అర్జీలాగా నే చూపించారు. బాగుంది. ఇలాంటి యువతకు కొత్త వుత్చాహోయుపిరి కలిగించేలా మీ కలం నుంచి 'అర్జి' కి స్పందించిన అల్లా తిరుగు రిప్లై ఇచినట్లుగా మరో కవితా ఖండము వస్తుందని ఆశిస్తున్నాను .

    ReplyDelete
  18. నిస్సహాయత లో వున్న* యువకుల

    ReplyDelete
  19. Vijay reddy garu, kavita chadivina meeku dhanyavaadaalu.naa avedanantaa chitikipoye musleem kutumbaala meedane. spandinchina meeku thanks.

    ReplyDelete