నీవెప్పుడూ చూడలేవు.
ఆకలి తన కబంధహస్తాలతో కబళిస్తుంటే....
మురికి గుంటనుండి కుళ్ళిపోయిన జాంపండు తీసుకుని తింటుంటే....
అది జామపండా, రోగపు చెండా నువ్వెప్పుడూ చూడలేవు.....
మంచు వాడియైన ఖడ్గంతో తనను కోస్తున్నా....
చిరుగుల కొంగును కప్పుకుని పాచి పనికి వెళ్ళే ఇల్లాలి పగిలిన పాదాలు....
వణికే పక్కటెముకలూ నువ్వెప్పుడూ చూడలేవు.
రాత్రంతా మానవ మృగాలు వేటాడుతుంటే.....
చీకటి చాటున నక్కి నక్కి బిక్కు బిక్కు మంటూ గడిపిన అనాధ చెల్లి మూగవేదన
నువ్వెప్పుడూ చూడలేవు.
అమ్మా, అయ్యా లేని చిన్నారులు ....
ఆకలికై ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన సైకత సరోవరాల రోద
నువ్వెప్పుడూ వినలేవు.
ఆకలి మంటలు నిను దహించవు.
వెతల కొడవళ్లు నిను కోయవు.
అప్పుల బాధలు నిను అంటవు.
పంచేంద్రియాలూ పని చేయని నీకు
బతుకు బండి కింద నలిగే జీవచ్చవాలు,
ఆకృతులూ, ఆక్రందనాలూ ఎప్పటికీ తెలియవు .
పంచేంద్రియాలూ పని చేయని నీకు
ReplyDeleteబతుకు బండి కింద నలిగే జీవచ్చవాలు,
ఆకృతులూ, ఆక్రందనాలూ ఎప్పటికీ తెలియవు--
ఈ వాక్యాలు చాలా బావున్నాయి ఫాతిమా గారు..
దీప గారూ,మీ ప్రసంసకు ధన్యవాదాలు.బ్లాగ్ కి స్వాగతం
Deleteఎవరినండీ నిందిస్తున్నారు,
ReplyDeleteచదువు'కొనే' మమ్మల్నా,
ఎక్కడున్నాడో తెలియని దేవుడినా?
కవిత గుండెలను పిండేలా ఉంది.
ఇవేమీ నా చుట్టూ జరగటం లేదు
అని ముసుగు తన్ని పడుకోవాలని ఉంది.
కాని నిద్ర వస్తే ఒట్టు!
సర్, చదువు కొంటున్నామని ఒప్పుకున్న మీకు ధన్యవాదాలు.
Deleteకానీ నిందించింది మాత్రం మిమ్మల్ని కాదు. యెందుకంటె నిద్ర పట్టలెదు అంటె మీరు కూదా ఆలొచిస్తున్నారు అని అర్ధం.
ఫాతిమా గారు, గుండెని సూటిగా మీ అక్షర బాణలు తాకాయి.. ఎంత వాడిగా వేశారండీ అక్షరబాణాలు.
ReplyDeleteచిన్నిగారూ, ఇవన్నీ గుండెలొ తొలెచె బాణాలె ఇలా బైతకి గాయాలై కనిపిస్తాయి.
DeleteVery touching!
ReplyDeleteధన్యవాదాలు చాతకం గారూ.
Deleteగడప దాటితే కంటికి కనిపించే విషయాలు అన్ని ఇవ్వే రోజు చూస్తూనే ఉన్నానండి...
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు
Deleteఅన్నీ చూడగలము.
ReplyDeleteకాని ఏమీ చేయలేము.
డన్యవాదాలు మీ స్పందనకు బొనగిరిగారు
Deleteపదునైన ప్రశ్నలు. సూటిగా మానవత్వాన్నే నిలదీస్తున్నాయి.
ReplyDeleteభారతి గారు, మానవత్వం మేలుకొంటుంది అంటారా ఏమొ.కవితన మెచ్హుకొన్న మీకు ధన్యవాదాలు
Deleteమేరాజ్ గారు, ఒక్కోసారి మీ కవితలు చదువుతుంటే మనసంతా అదోలా అయిపోతుంది.
ReplyDeleteఅంత బాగా రాస్తారు మీరు.
వెన్నెల గారూ, మనసు సున్నితం అయితె,
Deleteఇదే బాద మనల్ని నిలువనీయదు, మీకు నా బ్లాగ్ కి పుంన:స్వాగతం
మనసు పిండేస్తే ఎలా :)
ReplyDeleteSir, manasunndi kadaa anduke meekalaa anipistundi. thank you.
ReplyDeleteప్రశ్నలు మానవత్వాన్నే నిలదీస్తున్నాయి.
ReplyDeleteDear, kavitanu ardam chesukunnanduku thanks.
ReplyDeleteచుట్టూ తిరుగాడే దయనీయ జీవుల జీవన వ్యధ చూసీచూడనట్టుపోయే అందరికీ మీ కవిత సూటిగా తగులుతుంది. పనిచెయ్యని పంచేంద్రియాలూ పనిచెయ్యటం మొదలెడతాయి, ముందుగా ఆలోచనలతో...
ReplyDeleteఎప్పటిలానే ఇలాంటి కవితల్లో మీరు దిట్ట.
chinni aasha gaaroo, mee abhimaanaaniki dhanyavaadaalu.
ReplyDelete