Pages

Tuesday, 11 December 2012

తేనెల మూట






నీ మాట  తేనెల ఊట,
నువ్వో  మమతల తోట, 
నా జీవన గమ్యానికి పూలబాట,
బుద్దూ.. అని పిలిస్తే.. ఊ...అంటూ వస్తావు.
వెళ్ళూ..అంటే వెక్కిరిస్తావు.
నీతో ఎన్ని సాంగత్యపు  శుభదినాలో..
ఎన్ని కమ్మని మాటల గారాలో.. 
ఏమైనా రాదామంటే, నా  కన్నా
ముందే చేరిపోతావ్,
పోనీ నువ్వు చెప్పిందే రాద్దామంటే,
మూతి గుండ్రంగా పెట్టి  దూ..జూ.. అంటావ్.
లాచావా... అని కళ్ళు ఎగరేస్తావ్.

బుద్దూ..

నీవు నా ఆశల రెక్కల హంసవు.
నా కన్నుల మిన్నవి,
నా కలల చిట్టి రాకుమారునివి.
ఛిమ్మ చీకట్లోనూ  నీ చిరునవ్వే,
చందమామలోనూ  నా నువ్వే,

కన్నా..
నా కళ్ళజోడు దాచేసి,అల్లరిచేస్తావ్,
నీ చిన్ని స్వెటర్లో నన్ను వెచ్చబెడతావ్,
నూరేళ్ళ నీ జీవితాన,
నిత్యవసంతం విరియాలి.
అందనంత  దూరం వెళ్ళకు,
ముద్దుగా పిలిచే నీ పిలుపులో,
వేల బంధాలను వెతుక్కొనే,
మీ అమ్మ కే అమ్మను నేను.




18 comments:

  1. మీ అమ్మ కే అమ్మను నేనమ్మను.

    అమ్మకే తెలుసేమో ఆ లాలన.

    ReplyDelete
    Replies
    1. సర్,నిజమె అమ్మ మనస్సు మాత్రమే తపిస్తుంది ఇలా..
      ధన్యవాదాలు

      Delete
  2. ఫాతిమ గారు చాలా చాలా బాగుంది. తెలికైన పదాలతో ఇంత మంచి భావాలను ఎలా వ్యక్తికరించగలరండి బాబోయి.... మీ పోస్ట్ లు చదువుతుంటే చలం రచనలు చదువుతున్న సులువుగా అనందంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. డెవిడ్ గారూ, మీ ప్రసంస నాకు ఎంత గర్వాన్నిచ్హిందొ.. అంత గొప్ప కవితోపొల్చారు, ధన్యవాదాలు మీ అభిమానానికి

      Delete
  3. అమ్మ మాటంత కమ్మగా ఉంది మీ కవిత.
    పిల్లల వయసు ఎదక్కుండా అలా అక్కడే ఆగిపోతే ఎంతబాగుండు అనిపిస్తుంది కదూ, ఆ ముచ్చట్లు చూస్తుంటే.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ,నిజమే పిల్లలని చూస్తె ఆ కోరిక కలుగుతుంది,
      ఈ కవిత కేవలం నా ఊహ మాత్రమె,

      Delete
  4. అనురాగపు తరగని గనులు అమ్మమ్మలు.ఇలాంటి కవితలు అమ్మమ్మలే వ్రాయగలరు.

    ReplyDelete
    Replies
    1. Sir, nenu inkaa ammamma nu kaaledu. choosaaraa manavadu raakundaane vaadiki enta swaagatam palikaano. mechhina meeku danyavaadaalu.

      Delete
  5. బొమ్మ బాగుంది. బుద్ధూతో మీ ముచ్చట్లు బాగున్నాయి.
    ఆ తేనెల మూట మాకు కూడా పంచినందుకు మీకు
    థాంక్స్!

    ReplyDelete
    Replies
    1. సర్ ,నేను అమ్మమ్మని అయినప్పుడు నా మనవని ముచ్చట్లు తప్పకుండా మీతో పంచుకొంటను
      నా ప్రతి కవితనూ చదివి మెచ్చుకొనే సహృదయులు మీరు.ధన్యవాదాలు మీ ప్రశంసకు.

      Delete
  6. wowwwwwwwwwwwwwwww!

    నిజంగా అమ్మమ్మ..మీరు. ?

    అమ్మలే వ్రాయగలరు అనుకున్నాను. అమ్మమ్మ ఇంకా బాగా వ్రాయ గలరు కదా!

    ReplyDelete
    Replies
    1. vanajaa, twaragaa maa paapa pelli chesesi manavadito ilaa aadukovaalani undi. manavaraalainaa mudde..

      Delete
  7. ప్రతి స్త్రీలోనూ తల్లి కావాలనే కోరికా, తల్లైన తర్వాత అమ్మమ్మ కావాలనే కోరికా బీజరూపంలోనైనా ఉండి ఉంటాయి.మనవల్నెత్తుకోవాలని కోరుకోని వారెవరు?ఒక వయసు వచ్చాక ముద్దొచ్చే పిల్లల్ని చూసినప్పుడు మనకీ అలాంటి మనవడో మనవరాలో ఉంటే ఎంత బాగుణ్ణు అని ఉవ్విళ్ళూరకుండా ఎవరైనా ఉంటారా? ( మా మనుమలు మా యిల్లు వదలి వాళ్ల అమ్మ యింటికి పోమంటారు)అమ్మతనం కంటె అమ్మమ్మతనం స్త్రీలకు అనంద దాయకం. మీ కవిత దానిని ప్రతిఫలించింది.

    ReplyDelete
  8. చాలా బాగుంది...
    మేరాజ్ గారూ!
    అమ్మమ్మ అయిన తర్వాత వ్రాసినట్లుంది...@శ్రీ

    ReplyDelete
  9. మా ఇంట్లో కూడా ఇలాంటి తేనెల మూట క్షణం తీరిక లేకుండా
    మమ్మల్ని తన బందీలను చేసుకున్నాడండీ..
    అది కూడా ఒక కారణం నేను నా మిత్రుల పోస్టులకు స్పందించలేకపోవటానికి :)

    ReplyDelete